Begin typing your search above and press return to search.

అమ్మఒడి పథకంపై ఎలాంటి ఆంక్షలు లేవు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి

By:  Tupaki Desk   |   16 April 2022 7:02 AM GMT
అమ్మఒడి పథకంపై ఎలాంటి ఆంక్షలు లేవు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి
X
గడిచిన మూడు నాలుగు రోజులుగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అమ్మఒడి’ మీద సాగుతున్న ప్రచారాలు.. వస్తున్న కథనాలు జగన్ సర్కార్ ను ఇరుకున పెడుతున్నాయి. అమ్మఒడి పథకానికి ఆంక్షలు అమలు చేస్తున్నాయంటూ సాగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగారు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్. తాజాగా ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. అమ్మఒడి మీద జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.

అమ్మఒడి పథకంపై ప్రజల్లో లేనిపోని అపోహలన్ని క్రియేట్ చేస్తున్నారన్న ఆయన.. తమ ప్రభుత్వం ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. అయినప్పటికీ టీడీపీ నేతలు తప్పు పడుతున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు.. ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారాన్ని ప్రశ్నిస్తూ.. ‘అమ్మఒడి పథకానికి విధించినట్లుగా చెబుతున్న ఆంక్షల మీద ఆధారాలు చూపాలి. టీడీపీ నేతల్నిప్రజలు వెళ్లగొట్టినా సిగ్గు లేదు. ఏపీ ప్రజలు జగన్ పై ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఏపీకి జగన్ శాశ్వత సీఎం అనే ఆలోచనలతో ప్రజలు ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు.

పేదరికంలో ఉన్న వారు విద్యకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో జగనన్న అమ్మఒడిని తీసుకొచ్చారని.. ఇప్పటికే ఈ పథకం ద్వారా రెండుసార్లు డబ్బులు ఇవ్వటం జరిగిందన్నారు. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఏడాదికి రూ.15 చొప్పున వేయటం తెలిసిందే. ఈ తీరులోఇప్పటికి రూ.13వేల కోట్లకు పైనే ఖాతాల్లో వేసినట్లు చెప్పిన మంత్రి సురేశ్.. కరోనా సమయంలోనూ జగనన్న అమ్మఒడి పథకం ద్వారా అర్హులకు డబ్బులు అందించిన వైనాన్ని గుర్తు చేవారు.

2019లో ఈ పథకం కింద 43 లక్షల మంది లబ్థి పొందితే.. 2020లో 44 లక్షల మంది లబ్థి పొందిన వైనాన్ని ఆయన గుర్తు చేశారు. మంత్రి సురేశ్ మాటలు ఇలా ఉంటే.. వాస్తవం మరోలా ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ ఏడాది జనవరిలో అమ్మ ఒడి పథకం కింద లబ్థిదారుల ఖాతాల్లో వేయాల్సిన వేళ.. ఆ మొత్తాన్ని జూన్ కు వాయిదా వేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా అమ్మఒడి పథకానికి కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది ప్రభుత్వం. మొత్తం 12 షరతుల్ని పెట్టిన సంగతి తెలిసిందే.

స్కూళ్లకు 75 శాతం హాజరు.. కొత్త బియ్యం కార్డు. 300 యూనిట్ల కంటే తక్కువగా వాడినట్లుగా చెప్పే కరెంటు బిల్లు.. తల్లివిద్యార్థి ఒకే ఇంట్లో ఉన్నట్లుగా ఆధారం.. విద్యార్థి ఈకేవైసీ.. వాలంటీర్ దగ్గర వివరాల చెకింగ్.. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంచుకోవటం.. బ్యాంక్ అకౌంట్ ను ఆధార్ తో లింక్ చేసుకోవటం.. ఆధార్ తో ఫోన్ నెంబరును అనుసంధానం చేసుకోవటం లాంటివాటితో పాటు.. బ్యాంకు అకౌంట్ రన్నింగ్ లో ఉంటం.. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే ఎన్ పీసీఐ చేసుకోవటం.. గవర్నమెంట్ ఉద్యోగి.. ఆదాయపన్ను కట్టే వారికి పథకం వర్తించదని.. ఒకవేళ అలా తీసుకొని ఉంటే క్రిమినల్ కేసులు పెడతారన్న ఆంక్షలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రభుత్వ విధానంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటివేళ.. మంత్రి సురేశ్ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు.