Begin typing your search above and press return to search.
తెలంగాణ సీఎం పై ఏపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏమన్నారంటే
By: Tupaki Desk | 4 Feb 2022 3:30 PM GMTఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే తీవ్ర విమర్శ చేశారు. కొంతమంది కుహనా మేధావులు అంటూ.. ఆయన విరుచుకుపడ్డారు. నిజానికి ఇప్పటి వరకు ఆదిమూలపు సురేష్ అంటే.. సౌమ్యుడిగా పేరుంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేసిన ఆయన తర్వాత.. రాజకీయ బాట పట్టారు. అయితే.. ఎప్పుడూ .. ఎవరినీ ఆయనపరుషంగా వ్యాఖ్యానించి.. మీడియాలో నిలవలేదు. కానీ, తాజాగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శ చేశారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. రాజ్యాంగాన్ని మార్చాలని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సురేష్.. కొంత మందికుహనా మేధావులు రాజ్యాంగాన్నిమార్చాలని అంటున్నారని.. రాజ్యంగంలోని ఏ అంశం వాళ్లను అంతగా కలచి వేస్తోందో.. చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎస్సీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని దుయ్యబట్టారు. ఇక, ఏపీలో జరుగుతున్న ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వానికి మధ్య ఉన్న పీఆర్సీపైనా మంత్రి స్పందించారు. ప్రతి పీఆర్సీ అమలులో ఇబ్బందులు ఉంటాయని అవి చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని సురేష్ అన్నారు.
`'నేను ఉద్యోగిగా 6 పీఆర్సీలు చూశా. అప్పుడూ ఇలాంటి సమస్యలు వచ్చాయి. ఉద్యోగులకు సమస్యలు రావడం సర్వసాధా రణం. గెజిటెడ్ అధికారులకి సమస్యలు ఉన్నా రోడ్లు ఎక్కి ఆందోళన చెయ్యరు. గౌరవంగా మాట్లాడి పరిష్కరించుకుంటారు. గతంలో దళిత అధికారులు అంటే చులకన భావం ఉండేది. పోస్టింగ్, ప్రమోషన్లలో అన్యాయం జరిగేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇలాంటి అసోసియేషన్ వల్ల న్యాయం జరుగుతుంది. సీఎం జగన్ దళిత పక్షపాతి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించారు. మంచి స్థానాల్లో దళిత అధికారులకు సీఎం జగన్ అవకాశం ఇచ్చారు' అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.