Begin typing your search above and press return to search.

ఆ జంపింగ్ మంత్రిపై అభిమానుల్లో డౌట్!!

By:  Tupaki Desk   |   21 July 2017 9:52 AM GMT
ఆ జంపింగ్ మంత్రిపై అభిమానుల్లో డౌట్!!
X
ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షమైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యాల‌తో అధికార తెలుగుదేశం పార్టీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. త‌మ పార్టీ నుంచి గెలుపొంది ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తూ అధికార పార్టీలో చేరిన తీరుపై వైసీపీ పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో జంపింగ్‌లు స‌హా వారికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డం నాలుగువారాల్లో సమాధానం ఇవ్వాలని హైకోర్టు నోటీసులు జారీ చేయ‌డంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానంతోపాటు తెలుగుతమ్ముళ్లు సమాలోచనలో పడ్డారు. ఈ ఎపిసోడ్‌ తో క‌డ‌ప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున గెలుపొందిన సి.ఆదినారాయణరెడ్డికి సంబంధించిన అనుచ‌రులు స‌త‌మ‌త‌ప‌డుతున్న‌ట్లు జిల్లా వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. హైకోర్టు నోటీసుల ద్వారా ఫిరాయింపు చట్టం అమలైతే ఆదినారాయణరెడ్డి రాజకీయ భవిష్యత్ అయోమ‌యం పాల‌వ‌డం ఖాయ‌మ‌ని జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆయన అనుచరులు మదనపడుతున్నారని స‌మాచారం.

ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి సొంత జిల్లాలో పార్టీని పదిలం చేసుకోవడంతో పాటు త‌న ప‌ట్టుబిగించుకునేందుకు క్రియాశీలంగా ముందుకు సాగుతున్నారు. వైఎస్‌ జగన్ తన తండ్రి దివంగ‌త రాజ‌శేఖ‌ర్ రెడ్డి పంథాలో శతృత్వాన్ని మిత్రుత్వం చేసుకునేందుకు టీడీపీ నేతల్లో బలమైన నాయకులకు గాళం వేసి వారికి రాజకీయ భవిష్యత్ కల్పించేందుకు చర్చలు కూడా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పులివెందుల - జమ్మలమడుగు - కడప నియోజకవర్గాలపై పట్టు బిగించేందుకు జగన్ టీడీపీ నేతలతో లోలోపల టచ్‌ లో ఉన్నట్లు ప్రచారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో మంత్రి ప‌ద‌వి ఊడితే ఆదినారాయ‌ణ రెడ్డి ప‌రిస్థితి ఏమిటి? ఆయ‌న వెంట ఉండే వారెంద‌రు అనే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌టం గ‌మ‌నార్హం.

హైకోర్టు జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డికి నోటీసులు ఇచ్చిన దరిమిలా న్యాయస్థానం చివరకు ఏమి తీర్పు ఇస్తుందో అని తెలుగుత‌మ్ముళ్లు వైసీపీ వైపు క‌న్నేస్తున్న‌ట్లుగా స‌మాచారం. ఒకవేళ కుడి ఎడమైతే 2019 ఎన్నికల పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని సాక్షాత్తు మంత్రి అనుచ‌రులు కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా చెప్తున్నారు. తెలుగుదేశం అధిష్టానం మాత్రం ఆది పదవికి ఎలాంటి ఢోకా ఉండదని ఎవరు ఆందోళనపడవద్దన్న సంకేతాలు ఇస్తోంది. ఇదిలా ఉండగా వైసీపీ నుంచి గెలుపొందిన బద్వేలు ఎమ్మెల్యే టి.జయరాములుపై కూడా వేటువేసేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధ‌మ‌వుతున్నట్లు స‌మాచారం.