Begin typing your search above and press return to search.

టీడీపీకి గుడ్ బై చెప్పే తొలి నేత ఈయనే

By:  Tupaki Desk   |   2 Jun 2019 6:56 AM GMT
టీడీపీకి గుడ్ బై చెప్పే తొలి నేత ఈయనే
X
కడప జిల్లా... వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా.. ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు.. జగన్ అదే చేశారు. బలమైన టీడీపీ నేతలను చిత్తుగా ఓడించారు. సొంత జిల్లా కడపలో మొత్తానికి మొత్తం స్థానాలు గెలిచేశారు. క్లీన్ స్వీప్ చేసి కడపలో టీడీపీ ఉనికే లేకుండా ఊడ్చేశారు.

అయితే ఇదే కడపలో జగన్ ను ఓడించడానికి చంద్రబాబు వేసిన ప్లాన్లు అన్నీ ఇన్నీ కావు.. అప్పటికే వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆది నారాయణ రెడ్డిని ఆపరేషన్ ఆకర్ష్ పేరిట టీడీపీలోకి లాగేశారు బాబు.. ఆయన గెలిపించిన జగన్ నే టార్గెట్ చేసి చేసిన రాజకీయాలు అన్నీ ఇన్నీ కావు.. ఇక మొన్నటి నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా వైసీపీని ఓడించడంలో ఆది నారాయణ రెడ్డి అన్ని విధాలుగా సాయమందించారు. అందుకే ఆ ఎన్నిక తర్వాత మంత్రివర్గ విస్తరణలో టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆది నారాయణ రెడ్డికి మంత్రి పదవిని కట్టబెట్టారు. ఇక అప్పటి నుంచి జగన్ ను టార్గెట్ చేసి కడపలో రాజకీయం మొదలు పెట్టారు.

ఇక కీలకమైన ఎన్నికల వేళ.. బాబు అనాదిగా ఫ్యాక్షన్ పగలతో కొట్టుకుంటున్న ఇరు వర్గాలు ఆదినారాయణ రెడ్డి-రామ సుబ్బారెడ్డి ఫ్యామిలీలను ఏకం చేసి కడపలో పోటీచేయించారు. దశాబ్ధాల వైరం ఉన్నా.. చంద్రబాబు ప్రోద్బలంతో వీరు కలిసిపోయి పగలు మరిచి వైఎస్ జగన్ పార్టీని జిల్లాలో ఓడించాలనుకున్నారు. కానీ ట్రెయిన్ రివర్స్ అయ్యింది..

వైసీపీ సునామీలో కడపలో టీడీపీ కొట్టుకుపోయింది. ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ సీటును గెలవలేదు. కడపలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసి అన్నీ అసెంబ్లీ సీట్లను గెలిచేసింది... ఇక ఆదినారాయణ రెడ్డి కూడా ఎంపీ సీటులో ఓడిపోయాడు. రెండు పార్లమెంట్ సీట్లను వైసీపీయే గెలిచేసింది..

ఇప్పుడు చంద్రబాబు ప్రోద్బలంతో వైఎస్ జగన్ - ఆయన పార్టీని - కుటుంబాన్ని టార్గెట్ చేసిన ఆది నారాయణ రెడ్డి ఆందోళనగా ఉన్నారట.. జగన్ నుంచి ప్రతీకారం ఖచ్చితంగా ఉంటుందని భావిస్తున్నాడట.. అందుకే ఈ ఐదేళ్లు సేఫ్ జోన్ లో ఉండాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరడమే ఉత్తమమని ఆది నారాయణ రెడ్డి భావిస్తున్నాడట.. అలా అయితే జగన్ ను ఎదుర్కోవచ్చని అనుకుంటున్నాడట..

ఇలా బాబు కోసం రాజకీయాలు చేసిన ఇరుక్కున్న ఆది బీజేపీ వైపు చూస్తున్నాడట.. ఇప్పటికే పలువురు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో.. రాష్ట్రంలోని నేతలకు టచ్ లో ఉన్నట్టు తెలిసింది. రేపో మాపో ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమంటున్నారు.