Begin typing your search above and press return to search.
బ్రాండ్స్ వేర్వేరు..ఓనర్ మాత్రం ఒక్కరే బాస్
By: Tupaki Desk | 19 Nov 2017 11:30 PM GMTఒకడికి వంకాయి నచ్చుతుంది. మరొకరికి బంగాళదుంప అంటే మక్కువ ప్రదర్శిస్తారు. మరొకరికి బెండకాయి.. ఇంకొకరికి క్యారెట్.. ఇలా చెప్పుకుంటే జిహ్వకో రుచి.. అన్న మాట నిజం. సరిగ్గా ఇదే పాయింట్ ను బేస్ చేసుకొని ఒక ప్రముఖ కంపెనీ.. పలు రకాల బ్రాండ్లతో దుస్తుల్ని అమ్మే వైనం కనిపిస్తుంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సదరు కంపెనీ అమ్ముల పొదిలో ఉన్న అన్ని బ్రాండ్లు ఫేమస్ కావటం. ఇంతకీ ఆ కంపెనీ ఏమిటి? ఆ కంపెనీ బ్రాండ్లు ఏమిటన్న విషయంలోకి వెళ్లే ముందు మీకు కొన్ని శాంపిల్ బ్రాండ్ల పేర్లు చెబుతాం. విషయం ఇట్టే అర్థమైపోతుంది.
లూయి ఫిలిప్.. వాన్ హ్యుసెన్.. అలెన్ సోలే.. హ్యాకెట్.. పీటర్ ఇంగ్లాండ్.. పీపుల్.. ప్లానెట్ ఫ్యాషన్.. లినెన్ క్లబ్.. బేర్.. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు వందకు పైగా ఫేమస్ బ్రాండ్లు ఆదిత్య బిర్లా కంపెనీకి చెందినవే. అంతేనా.. ఈ కంపెనీకి చెందిన అతిపెద్ద ఛైన్ రెడీమేడ్ గొలుసు దుస్తుల దుకాణాలు కూడా ఒకదాంతో మరొకటి సంబంధం లేకుండా ఉంటాయి. వేర్వేరుగా కనిపించినా.. కంపెనీ మాత్రం ఒకటే.
వ్యాపార విస్తరణలో భాగంగా అమెరికాకు చెందిన వాన్ హ్యుసెన్ తాలుకు హక్కుల్ని భారత్.. మిడిల్ ఈస్ట్.. సార్క్ దేశాల వరకూ ఆదిత్య బిర్లా పొందింది. అదే విధంగా హ్యాకెట్ హక్కుల్ని ఇండియా వరకూ ఆదిత్య బిర్లా దక్కించుకుంది. వీటికి మినహాయిస్తే మిగిలిన బ్రాండ్లు అన్ని ఆదిత్య బిర్లా సొంతం.
అదే విధంగా రిటైల్ దుకాణాల విషయానికి వస్తే ప్యాంటలూన్స్ కూడా ఆదిత్య బిర్లాదే. ప్రఖ్యాత బ్రాండ్ ఫ్యాక్టరీ ఛైన్ దుకాణం కూడా ఆదిత్య బిర్లాకు చెందిందే. ఎందుకిలా అంటే.. చాలా సింఫుల్. దేశంలోని ఉన్నత ఆదాయ వర్గాలు మొదలు ఎగువ మధ్యతరగతి.. మధ్యతరగతి.. దిగువ మధ్యతరగతికి చెందిన వినియోదారుల్ని తమ బ్రాండ్లకు అలవాటు చేసే మార్కెటింగ్ వ్యూహంలోనే ఇలా చేశారని చెప్పాలి. బ్రాండెడ్ దుస్తులు కొనాలని అనుకున్న వారు ఎవరైనా సరే.. తమ బ్రాండ్లను మాత్రమే వాడాలన్న రీతిలో ఆదిత్య బిర్లా వ్యాపార వ్యూహం ఉంటుందని చెప్పాలి.