Begin typing your search above and press return to search.

చిన జీయర్ స్వామిపై ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   16 March 2022 4:30 PM GMT
చిన జీయర్ స్వామిపై ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు
X
త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామిపై కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. స‌మ్మ‌క్క‌-సారల‌మ్మ‌ను విద్యాధికులు, వ్యాపార‌వేత్త‌లు కూడా ద‌ర్శించుకోవ‌డం ఏమిటని చిన‌జీయ‌ర్ స్వామి చేసిన వ్యాఖ్య‌లను సీత‌క్క తీవ్రంగా ఖండించారు.

తమ తెలంగాణ ఆత్మ‌గౌర‌వ పోరాటానికి ప్ర‌తీక‌లైన స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ‌పై ఆంధ్రా చిన‌జీయ‌ర్ స్వామి ఎందుకు అనుచిత వ్యాఖ్య‌లు చేశాంటూ సీతక్క ప్రశ్నించారు. అంతేకాదు, తెలంగాణ‌, ఆదివాసీ స‌మాజానికి తక్షణమే చిన‌జీయ‌ర్ స్వామి క్ష‌మాప‌ణ చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు.

ఆదివాసుల ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీలుగా మారి, తెలంగాణ బిడ్డ‌ల‌ కోరిక‌లు తీర్చే స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మల‌ జాత‌ర మేడారం జాత‌ర‌ అని, ఆసియాలోనే అతి పెద్ద గిరిజ‌న జాత‌ర ఇదని సీతక్క అన్నారు. ఈ జాత‌ర వైభ‌వాన్ని, దేవ‌త‌ల కీర్తిని త‌గ్గించేలా చేసిన చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్య‌ల‌ను వెంట‌నే వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నామని సీతక్క చెప్పారు.

తమ దేవ‌త‌లు ప్రకృతి దేవ‌త‌లని, అక్క‌డ ఎలాంటి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార‌మూ జ‌ర‌గ‌డం లేదంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. సమ్మక్క-సారలమ్మ దేవ‌త‌ల‌ను చూడాలంటే టికెట్లు అవసరం లేదని విమర్శించారు. 120 కిలోల బంగారంతో చేసిన స‌మ‌తామూర్తిని సందర్శించాలంటే రూ.150 టికెట్టు పెట్టాలని, అక్కడ వ్యాపారం చేస్తున్నారని సంచలన విమర్శలు గుప్పించారు.

మేడారంలో అలాంటి వ్యాపారాలుండవని, సమ్మక్క-సారలమ్మ త‌ల్లుల కీర్తిని దిగ‌జార్చేలా చేసిన వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ‌ సీఎం కేసీఆర్ స్పందించాలని సీతక్క డిమాండ్ చేశారు. ఈ దుర్మార్గ విధానాల‌పై కేసీఆర్ స‌ర్కారు వైఖ‌రి ఏంటో తెలియ‌జేయాలని డిమాండ్ చేస్తూ సీతక్క విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి, సీతక్క డిమాండ్ పై చిన జీయర్ స్వామి, కేసీఆర్ లు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.