Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కు : అన్ని రహస్యంగానే జరిగాయి...ఆ ఇద్దరు ఏమైయ్యారు !

By:  Tupaki Desk   |   10 March 2021 5:30 AM GMT
విశాఖ ఉక్కు : అన్ని రహస్యంగానే జరిగాయి...ఆ ఇద్దరు ఏమైయ్యారు !
X
విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ సాధించుకున్న ఉక్కు పరిశ్రమను 100 శాతం ప్రైవేటీకరణ చేయడం తథ్యం అంటూ కేంద్ర అర్థక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది. సభలో ఎంపీ అడిగిన ప్రశ్నకి సమాధానం ఇస్తూ నిర్మలమ్మ విశాఖ ఉక్కు పై పూర్తిగా క్లారిటీ ఇచ్చేసారు. ప్రైవేటీకరణ చేయకుండా ఆపడం ఎవరి తరం కాదు అని అన్నారు. నిర్మలమ్మ పార్లమెంట్ లో చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత విశాఖపట్నం లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కార్మికులు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసే అలల వలే ఆందోళన బాట పట్టారు. రాత్రి , పగలు అన్న తేడా లేకుండా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. జాతీయ రహదారిని నిర్భంధించారు.

ఇదిలా ఉంటే .. ఆందోళనలు చేస్తున్న కార్మికులు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించాయి. అయితే , కాకమీద ఉన్న కార్మికుల చేతికి చిక్కితే పరిస్థితి మరోలా ఉంటుంది అని ముందే ఊహించిన స్టీల్ ప్లాంట్ సీఎండీ పీకే రధ్, డైరెక్టర్ పర్సనల్ కెసి దాస్ రాత్రికి రాత్రే ఢిల్లీ వెళ్ళిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో విషయం ఏమిటంటే .. వీరిద్దరూ ఒడిషాకు చెందినవారు. వీరికి ప్రైవేటీకరణ గురించి పూర్తి సమాచారం ఉందని కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఒడిషాకి చెందిన కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కి వీరు అత్యంత సన్నిహితులు అని ప్రచారం జరుగుతోంది. ఉక్కు ప్రైవేటీకరణ ప్రకటనతో కార్మికులు తమ ఆఫీస్ పైకి దూసుకువస్తారన్న సమాచారం ఉండంతోనే వీరు ఢిల్లీకి వెళ్లారు అని తెలుస్తుంది. అదే సమయంలో ఫైనాన్స్ డైరెక్టర్ వేణుగోపాల్ మాత్రం ఆందోళనకారులకు దొరికిపోయారు. ఆయన కారును అడ్డగించి కార్మికులు తన తీవ్ర నిరశనను వ్యక్తం చేశారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ముందుగా తమకి తెలియదు చెబుతున్న ప్లాంట్ అధికారులు , రహస్యంగా ఈ పని కానిచ్చేశారని తెలుస్తుంది. పోస్కోతో ఒప్పందం స్టీల్ ప్లాంట్ అధికారుల సంతకం తోనే పూర్తి చేశారు. అలాగే ఈ విషయాలు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా చెప్పేవరకు ఎవరికీ తెలియదు. అలాగే ప్లాంట్ కి చెందిన 22 ఎకరాల భూమిని జాతీయ భవన నిర్మాణ సంస్థకి అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని బయటకి రానివ్వలేదు.