Begin typing your search above and press return to search.

చెప్పింది చేసి చూపించిన ట్రంప్..ఏంటంటే?

By:  Tupaki Desk   |   15 April 2020 7:07 AM GMT
చెప్పింది చేసి చూపించిన ట్రంప్..ఏంటంటే?
X
డోనాల్డ్ ట్రంప్ .. అమెరికా అధినేత - ఏదైనా ఒకసారి చేప్తే ఆచరణలో పెట్టి చేసి చూపించే సత్తా ఉన్న నేత. ఏదైనా ట్రంప్ నోటి నుండి వస్తే ...ఆరు నూరైనా కూడా అది జరిగితీరుద్ది...జరిగితీరాల్సిందే. అధినేతగా ఎంపికైన తరువాత ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ ...తాజాగా కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటి అంటే ..ప్రస్తుతం అమెరికాలో మహమ్మారి కరోనా విలయతాండవం చేస్తుంది.

దీనిపై ట్రంప్ గత కొన్ని రోజులుగా ప్రపంచ ఆరోగ్య సంస్థపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. డ‌బ్ల్యూహెచ్ వో చాలా వ‌ర‌కూ చైనా సెంట్రిక్ గా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. అలాగే మహమ్మారి ఇంతలా విస్తరించడానికి కారణం కూడా డ‌బ్ల్యూహెచ్ వో నే అని మొదట్లో దీన్ని అంతం చేయడంలో విఫలం అయ్యింది అని తెలిపాడు. అలాగే మొదట్లో డ‌బ్ల్యూహెచ్ వో చైనా కి మద్దతుగా మాట్లాడింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)కు నిధులు అందజేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పని చేశారు. తమ దేశం నుంచి సంస్థకు అందించే నిధుల్ని పూర్తిగా నిలిపివేయాలని అధికారుల్ని ఆదేశించారు.

వ‌ర‌ల్ఢ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ కు ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుల్లో అమెరికా ఇచ్చే నిధులు కూడా ముఖ్య‌మైన‌వి. ఆ సంస్థ‌కు వ‌చ్చే మొత్తం నిధుల్లో 15 శాతం అమెరికా నుంచినే వ‌స్తాయ‌ట‌!ఈ క్ర‌మంలో ఆ నిధుల‌ను అమెరికా పూర్తిగా ఆపేసిన‌ట్టుగా తెలుస్తోంది. ట్రంప్ ప్ర‌క‌టించిన వారం ప‌ది రోజుల్లోనే ఆ ప్ర‌భావం మొద‌లైంద‌ట‌. అయితే అమెరికా తీరును యూనైటెడ్ నేష‌న్స్ త‌ప్పు ప‌ట్టింది. డ‌బ్ల్యూహెచ్ వో కు వ‌న‌రుల కోత విధించాల్సిన స‌మ‌యం ఇది కాద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి అభిప్రాయ‌ప‌డింది.