Begin typing your search above and press return to search.

మార్చిలో..అడ్మినిస్ట్రేటివ్ కేపిట‌ల్ కు షిఫ్టింగ్?

By:  Tupaki Desk   |   19 Dec 2019 5:49 AM GMT
మార్చిలో..అడ్మినిస్ట్రేటివ్ కేపిట‌ల్ కు షిఫ్టింగ్?
X
ఏపీ పాల‌నా ప‌ర‌మైన రాజ‌ధానిగా వైజాగ్ ఉండ‌వ‌చ్చ‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అందుకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. రాజ‌ధాని అంశంపై అధ్య‌య‌న క‌మిటీ అధ్య‌య‌నం సాగుతూ ఉంద‌ని వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న మూడు రాజ‌ధాని ఫార్ములాను కూడా ప్ర‌క‌టించారు. ఏపీకి మూడు రాజ‌ధానులు ఉండ‌వ‌చ్చ‌ని జ‌గ‌న్ అన్నారు.

ఇక ఆ ప్ర‌క‌ట‌న దాదాపు ఖ‌రారు అయిన‌ట్టే. ఈ మేర‌కు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతూ ఉంది. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న‌లు రాబోతున్నాయ‌ని, గెజిట్ విడుద‌ల చేసి.. ఆ త‌ర్వాత షిఫ్టింగ్ ప‌నులు ప్రారంభం కాబోతున్నాయ‌ని స‌మాచారం. వైజాగ్ లో అడ్మినిస్ట్రేటివ్ కేపిట‌ల్ కు అనుగుణంగా ప్ర‌భుత్వ అధికారులు అక్క‌డ‌కు చేరాల్సి ఉంటుంది.

ఏపీకి ప‌దేళ్ళ పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాద్ ను పంచుకునే అధికారం ఉన్నా.. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు ఉన్న‌ఫ‌లంగా అధికారుల‌ను అమ‌రావ‌తి ప్రాంతానికి త‌ర‌లించారు. కొంద‌రు అధికారులు అక్క‌డ‌కు షిఫ్ట్ అయ్యారు. మ‌రి కొంద‌రు.. హైద‌రాబాద్ తో బంధాన్ని వ‌దులుకోకుండా వీకెండ్స్ ఇక్క‌డ‌కు చేరుకుంటూ వ‌చ్చారు. అయితే ఇప్పుడు విశాఖ అడ్మినిస్ట్రేటివ్ కేపిట‌ల్ కావ‌డంతో.. అధికారులు అక్క‌డ‌కు బ‌దిలీ కావాల్సి ఉంటుంది.

మార్చి నెల‌లో షిఫ్టింగ్ ఉంటుంద‌ని స‌మాచారం అందుతూ ఉంది. ఇక అడ్మినిస్ట్రేటివ్ కేపిట‌ల్ కు రెండు వేల ఎక‌రాల వ‌ర‌కూ భూ సేక‌ర‌ణ జ‌ర‌గ‌వ‌చ్చ‌ని స‌మాచారం. అందులో భాగంగా భీమిలి స‌మీపంలో రెండు వేల ఎక‌రాల భూ సేక‌ర‌ణ జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది.