Begin typing your search above and press return to search.

జనాల్ని చంపేందుకు వచ్చినోడ్ని క్షమించాలంట

By:  Tupaki Desk   |   7 Aug 2015 4:24 AM GMT
జనాల్ని చంపేందుకు వచ్చినోడ్ని క్షమించాలంట
X
సంతానం మీద ప్రేమ ఉండటాన్ని ఎవరూ కాదనలేరు. కానీ.. ఒకదేశం మీదకు అక్రమంగా వచ్చి.. ఆ దేశంలోని జవాన్ల మరణానికి కారణమై.. ప్రజల్ని చంపేందుకు వచ్చిన ఉగ్రవాదిని క్షమించాలా? వేరే దేశంలో అయితే ఈ మాట చెప్పేందుకు కూడా అవకాశం ఇవ్వరు. కానీ.. భారతదేశం వ్యవహారం కాస్త వేరు. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది తాజాగా పట్టుబడటం.. అతగాడిది పాకిస్థాన్ అని తేలటం.. దీంతో.. అతడి తండ్రి వివరాలు తెలుసుకునేందుకు ఫోన్ చేశారు.

ఈ సందర్భంగా తాజాగా పట్టుబడిన నావెద్ తండ్రి ఫైసలాబాద్ లో నివాసం ఉంటాడని.. అతను స్థానిక పంజాబీ బాషలో మాట్లాడినట్లు చెబుతున్నారు. లష్కర్ ఎ తోయిబా నావెద్ చనిపోవాలని కోరుకుందని.. అయితే.. తన కుమారుడు ప్రాణాలతో సజీవంగా పట్టుబడటంపై ఒక రకంగా సంతోషం వ్యక్తం చేశాడు. లష్కర్ కుట్రలకు తన కొడుకు బలిపశువు అయ్యాడని వ్యాఖ్యానించిన నావెద్ తండ్రి.. తన కుమారుడ్ని క్షమించాలని వేడుకుంటున్నాడు.

ఇప్పటివరకూ గళం విప్పని మానవతావాదులు.. నయా లౌకికవాదులు.. అసదుద్దీన్ ఓవైసీ లాంటి వారు.. ఉగ్రవాది తండ్రి యాకూబ్ ఖాన్ మాదిరే క్షమించాలని కోరతారా? లేక.. చట్టప్రకారం అతన్ని శిక్షించాలని కోరుకుంటారా? భారతదేశం లాంటి దేశంలో పోలీసులకు పట్టుబడితే.. తన కుమారుడి ప్రాణాలకు పక్కా గ్యారెంటీ ఉంటుందని భావించాడేమో కానీ.. తన కొడుకు సైనికులకు పట్టుబడటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేయటం వెనుక కారణం ఇదే అయి ఉంటుందేమో..?