Begin typing your search above and press return to search.
ఎస్సీ నేతను కాబట్టే.. చిన్నచూపు చూస్తున్నారు!
By: Tupaki Desk | 20 May 2023 9:53 PM GMTరాజకీయం ఎక్కడైనా రాజకీయమే.. అధికార పక్షం.. ఎక్కడైనా అధికార పక్షమే.. అన్నట్టుగా ఉంది తమిళ నాడులో పరిస్థితి. అక్కడ కూడా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేతలకు ఎలాంటి వాల్యూ లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉంటే చాలు.. వారికిఅసలు ప్రాధాన్యం లేకుండా పోతోంది. ఏపీలోను.. తెలంగాణలోనే ఇలా ఉందని అనుకుంటే.. పొరపాటే తమిళనాడులోనూ ఇదే పరస్థితి కొనసాగుతోంది.
తాజాగా తమిళనాడులోని భవానీసాగర్ అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఎ.బన్నారి తనకు జరుగుతున్న అవమా నాలు.. ఈసడింపులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేను కాబట్టే.. తనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గ్రామ పాలనాధికారి(వీఏఓ) కూడా తనను పట్టించుకోవడం లేదని, ఇక, తహసీల్దార్ అయితే.. చాలా చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పే
``పేరుకే నేను ఏమ్మెల్యేగా కొనసాగుతున్నా. కనీసం గౌరవం ఇచ్చే వాళ్లుకూడా లేరు`` అని ఎమ్మెల్యే బన్నారి ఉద్వేగానికి లోనయ్యారు. ఈరోడ్ జిల్లా భవానీసాగర్ నియోజకవర్గం(ఎస్సీ) ఎమ్మెల్యే బన్నారి చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీ వెబ్సైట్లో పొందుపరిచింది.
ఎమ్మెల్యే ఏమన్నారంటే..
తాను ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు పూర్తి అయిందని, ఇంతవరకు తన నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదన్నారు. తాను ఏదైనా చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. వీఏఓ మొదలు తహసీ ల్దార్ వరకు భేఖాతరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఓట్లు వేసిన ప్రజలకు న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నానని భావోద్వేగానికి గురయ్యారు. ఇంటి పట్టాలు, పింఛన్లు, ప్రభుత్వ పథకా ల కోసం తన వద్ద కు వచ్చే వాళ్లకు న్యా యం చేసే విధంగా అధికారులకు సిఫారసులు చేసినా ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదన్నారు.
ఇక, పోలీసులు, పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులు అయితే, తనను చిన్నచూపు చూస్తున్నారని పేర్కొన్నారు. తాను ప్రశ్నించినా, సమాధానం కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే అనే మర్యాద కూడా ఇవ్వకుం డా వెళ్లి పో తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తాను ఎస్సీని కా వడంతో ఇక్కడున్న అధికారులు మరీ చిన్నచూపు చూస్తున్నారని, ఈ విషయాన్ని ఇంతవరకు తన పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లలేదన్నారు. ప్రభుత్వ అధికారిక వేడుకలకు ఆహ్వానాలు అంతంత మాత్రమేనని, తనను ప్రజాప్రతినిధిగా కాకుండా వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తిగానే అందరూ చూస్తున్నారని ఉద్వేగ భరితంగా వ్యాఖ్యలు చేశారు. కాగా, ప్రస్తుతం ఎమ్మెల్యే బన్నారి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.