Begin typing your search above and press return to search.
మర్డర్లు చేసిన హిట్లర్ ఫోన్ రచ్చ చేస్తోంది
By: Tupaki Desk | 18 Feb 2017 1:09 PM GMTఅడాల్ఫ్ హిట్లర్...ప్రపంచంలో నియంతలు ఎందరు ఉన్నప్పటికీ ఈ పేరు టాప్ లో నిలుస్తుంది. ఆయన చరిత్ర అలాంటిది మరి! తను నమ్మిన సిద్ధాంతం కోసం వేలాది మందిని పొట్టనపెట్టుకున్న హిట్లర్ కు చెందిన అత్యంత కీలకమైన వస్తువు ఒకటి ఇపుడు అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయింది. తన లక్ష్యసాధన సమయంలో అనేక వేల మందిని మట్టుబెట్టేందుకు ఉపయోగించిన ల్యాండ్ ఫోన్ ను ఇపుడు వేలం వేస్తున్నారు. పాతకాలపు ఈ ల్యాండ్ లైన్ టెలిఫోన్ ఎర్రగా...రక్తవర్ణంలో ఉండి చూడగానే హిట్లర్ ఆలోచనలను గుర్తుకు చేస్తుంది. ఈ ఫోన్ ద్వారానే హిట్లర్ అనేకమందిని చంపేయమని ఆదేశాలు ఇచ్చారు. హిట్లర్ తన ప్రధాన కార్యాలయంతో పాటు ప్రయాణాల్లో కూడా ఈ ఫోన్ ఉపయోగించేవారు. ఈ ఫోన్ పై హిట్లర్ కు చెందిన నాజీపార్టీ చిహ్నమైన స్వస్తిక్ తో పాటు హిట్లర్ పేరు కూడా చెక్కి ఉంది.
తన సామ్రాజ్యాకాంక్షను సఫలం చేసుకునేందుకు రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన హిట్లర్... సొంత దేశమైన జర్మనీ ఓడిపోవడంతో రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు బ్రిగేడ్ సర్ రాల్ఫ్ రేనర్ బెర్లిన్ లోని హిట్లర్ బంకర్ ను చూసేందుకు వెళ్లారు. ఆ సమయంలో రష్యా అధికారి ఒకరు ఈ టెలీఫోన్ ను ఆయనకు అందజేశారట. ఆ బ్రిగేడ్ కుమారుడు హిట్లర్ కు చెందిన ఫోన్ ను వేలంలో అమ్మబోతున్నారు. సుమారు 2-3 లక్షల అమెరికన్ డాలర్లు ఈ ఫోన్‌కు వస్తాయని అంచనా వేస్తున్నారు. అనేక వేల మందిని బలిగొనేందుకు కారణమై ఈ ఫోన్ ను ఎవరు చేజిక్కుంచుకుంటారో చూడాలి మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/