Begin typing your search above and press return to search.
ఏపీలో ముందస్తు..? జగన్ వ్యూహమేంటి?
By: Tupaki Desk | 26 Aug 2021 2:30 PM GMTఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడి.. రెండున్నరేళ్లు కూడా పూర్తికాలేదు. అయినప్పటికీ.. రాష్ట్రంలో జగన్ ప్రభు త్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని.. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన కూడా వస్తుంద ని.. పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనికి కారణమేంటి? జగన్ వ్యూహత్మకంగా అడుగు లు వేస్తున్నా రా? లేక.. ఏదైనా సంచలనం సృష్టించాలని భావిస్తున్నారా? అనే చర్చ సాగుతోంది. గత 2019 ఎన్నికల్లో.. జగన్ 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. నవ్యాంధ్రలో పెను సంచలనం సృష్టించారు. ఇంత భారీ సంఖ్యలో.. ఎమ్మెల్యేలను కైవసం చేసుకున్న పార్టీ దేశంలో ఇదే కావడం కూడా గమనార్హం.
అయితే.. ప్రభుత్వం ఏర్పడి... కనీసం.. రెండున్నరేళ్లు కూడా పూర్తికాకముందుగానే.. అప్పుడే ముందస్తు ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల ఆలోచన చేస్తోంది. వచ్చే ఏడాదికాలంలో.. జమిలి నిర్వహించడం ద్వారా ఎన్నికల ఖర్చును తగ్గించి.. ప్రజాధనాన్ని కాపాడతామ ని.. కేంద్రం కొన్నాళ్లుగా అవకాశం వచ్చిన ప్రతిసారీ ప్రకటిస్తోంది. ఇక, ఇదేవిషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. ప్రకటనలు చేస్తున్నారు. జమిలి వస్తుందని.. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని.. ఆయ న చెబుతున్న విషయం తెలిసిందే. సరే! ఈ విషయం ఇప్పుడు మళ్లీ మూలనబడింది.
కానీ, అనూహ్యంగా జగన్ ప్రభుత్వం.. ముందస్తు ఎన్నికలకు వెళ్తుందనే చర్చ తెరమీదికి వచ్చింది. దీనికి కారణం ఏంటి? అంటే.. విపక్షాల దూకుడుకు కళ్లెం వేయడమేనని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం.. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై విపక్షాలు చాలా దూకుడుగా ఉన్న విషయం తెలిసిందే. ప్రతి దాన్నీ రాజకీయం చేయడంతోపాటు.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారని.. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించే పరిస్తితి తెస్తున్నారని.. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక, దళితులపై దాడులు చేస్తున్నారని.. బీసీలకు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసినా.. వారికి హక్కులు ఇవ్వలేదని.. ఆరోపిస్తున్నారు.
ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ యువ నేత.. లోకేష్‌లు కూడా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోం దని.. ప్రజల్లోనూ జగన్‌కు మద్దతు తగ్గిపోయిందని.. కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విపక్షాల దూకుడుకు చెక్ పెట్టడంతోపాటు.. వైసీపీలోనూ కొందరు నేతల దూకుడుకు అ డ్డుకట్ట వేసేందుకు కూడా ముందస్తు.. ఉపయుక్తంగా ఉంటుందని.. జగన్ భావిస్తున్నట్టు కొందరు చెబు తున్నారు. గతంలో 2018లోనూ తెలంగాణ సారథి.. కేసీఆర్ ముందస్తు మంత్రం పఠించిన విషయం తెలిసిందే.. అప్పట్లోనూ ఇదే పరిస్థితి నేపథ్యంలో ఆయన ముందస్తుకు వెళ్లారు.
ఎవరూ ఊహించని విధంగా ఆఎన్నికల్లో కేసీఆర్ పుంజుకున్నారు. ఇప్పుడు జగన్ కూడా ఇదే వ్యూహంతో ముందుకు సాగుతున్నారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో.. చూడాలి. అయితే.. ఎంత ముందస్తుకు వెళ్లాలని అనుకున్నా... మరో ఏడాది పట్టే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.