Begin typing your search above and press return to search.

అద్వానీపై బీజేపీ ''ఎమర్జెన్సీ''

By:  Tupaki Desk   |   26 Jun 2015 4:14 AM GMT
అద్వానీపై బీజేపీ ఎమర్జెన్సీ
X
నీతులు చెప్పే వారే కానీ.. ఆచరించే వారు చాలా తక్కువైపోయారని.. ఇక.. రాజకీయాల్లో ఇలాంటివి ఏమాత్రం కనిపించవన్న విషయం మరోసారి రుజువైంది. బీజేపీ కురువృద్ధుడు అద్వానీని పక్కన పెట్టేసిన కార్యక్రమం ఎంత ఘనంగా జరుగుతుందన్న విషయాన్ని బీజేపీ తాజాగా మరోసారి చెప్పకనే చెప్పేసింది.

బీజేపీ అనుబంధ సంస్థ అయిన శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ పరిశోధనా సంస్థ గురువారం ఢిల్లీలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. దేశంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి 40 ఏళ్లు పూర్తి అయిన సందర్భంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పార్టీకి పెద్ద అయిన అద్వానీని ఆహ్వానించలేదు.

మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అద్వానీని పక్కన పెట్టేయటం.. ఆయన్ను అవమానించటం తరచూ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఎమర్జెన్సీ అంశంపై మోడీ సర్కారును ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేసిన అద్వానీని ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు.

ఈ కార్యక్రమానికి అమిత్‌షాను పిలిచినప్పటికీఅద్వానీని మాత్రం మరిచింది. మొత్తానికి అద్వానీ విషయంలో బీజేపీ ఎలాంటి వైఖరి అనుసరిస్తుందన్న విషయం తాజా ఉదంతంతో చెప్పకనే చెప్పినట్లు అయ్యిందన్న భావన వినిపిస్తోంది.