Begin typing your search above and press return to search.
బడ్జెట్ రియాక్షన్స్ ...మోడీకి ఊహించని మద్దతు
By: Tupaki Desk | 29 Feb 2016 11:19 AM GMTకేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై యథావిధిగా రాజకీయ పార్టీలు మొదలుకొని విశ్లేషకులు - వ్యాపారవర్గాలు తమ స్పందనను వినిపించాయి. మెజార్టీ అభిప్రాయాలు పెదవి విరిచినట్లుగా ఉన్నప్పటికీ ఊహించని మద్దతు మోడీకి దక్కింది. మోడీ జమానాలో గౌరవం కోల్పోయినట్లుగా ఉన్న బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ బడ్జెట్ విషయంలో ఊహించని విధంగా స్పందించారు. పార్లమెంటులో అనేక బడ్జెట్లను సమర్పించడం చూశానని, ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించిన బడ్జెట్ అత్యుత్తమ బడ్జెట్ లలో ఒకటని కితాబిచ్చారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ సైతం ఈ బడ్జెట్ ను మెచ్చుకున్నారు. అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ గ్రామీణ - రైతుల - పేదల బడ్జెట్ గా అభివర్ణించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలిసారిగా పేదలు - రైతులు - గ్రామీణులకు పెద్ద పీట వేసిన బడ్జెట్ ఇదని ఆయన అన్నారు.
మరోవైపు అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ పెదవి విరిచింది. దేశ ప్రగతికి - పురోగతికి - ఆర్థిక సుస్థిరతకు ఏది ఉండాలో అదే ఈ బడ్జెట్ లో లోపించిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్ నాథ్ అన్నారు. లోక్‌సభ వాయిదా పడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అరుణ్ జైట్లీ దశ, దిశ లేని బడ్జెట్ ను ప్రవేశపెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ నేత శశిథరూర్ మాట్లాడుతూ...ఏమాత్రం రంగు, రుచి, వాసన లేని అతి సాధారణ బడ్జెట్ అని అన్నారు. యూపీఏ హయాంలోని పలు పథకాలనే మళ్లీ జైట్లీ పేర్కొన్నారని శశిథరూర్ ఎద్దేవా చేశారు.
బడ్జెట్ విశ్లేషకుడు శేఖర్ గుప్తా సైతం ఈ పద్దుల పంపకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యాపార ప్రతికూల బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. కేవలం పన్నులు చెల్లించడం సులభతరం చేసిన బడ్జెట్ మాత్రమే ఇదని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ ఆర్థిక వేత్త రాధికారావు మాట్లాడుతూ... అరుణ్ జైట్లీ ఈ రోజు లోక్ సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి ప్రోత్సాహకరంగా ఉందని అన్నారు. ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణకు ఇచ్చిన ప్రాధాన్యత మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపుతుందన్నారు. గ్రామీణ రంగానికి కేటాయింపులు బాగున్నాయనీ, అలాగే రోడ్లు రహదారులకు ఇచ్చిన ప్రాధాన్యత రవాణ రంగం పురోగమించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.