Begin typing your search above and press return to search.
హైదరాబాద్ ఎందుకు వదిలి వెళుతున్నావ్..?
By: Tupaki Desk | 24 Sep 2015 4:56 AM GMTదేశంలోనే అత్యుత్తుమ పారిశ్రామిక పాలసీ తమదేనని స్వదేశంలోనూ.. విదేశంలో పదే పదే చెప్పుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారుకు కాస్తంత ఇబ్బంది కలిగించే పరిస్థితి ఒకటి చోటు చేసుకుంది. ఓపక్క కొత్త కొత్త కంపెనీలు రావాలని.. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని.. తమ వద్ద వ్యాపారం చేసుకునేందుకు అవకాశాలెన్నో ఉండటమే కాదు.. భారీ మార్కెట్ ఉందని ఊరిస్తున్న కేసీఆర్ సర్కారు ప్రచారానికి దెబ్బేసేలా ఓ పెద్ద కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయం కలకలం రేపుతోంది.
పారిశ్రామికవర్గాల్లో విపరీతమైన చర్చకు తావిస్తున్న ఆ కంపెనీనే అడ్వాంటా. బహుళజాతి విత్తనాల సంస్థగా సుపరిచితమైన ఈ కంపెనీ.. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం నిర్వహిస్తుంది.
కారణం ఏమిటో బయటకు రాలేదు కానీ.. ఈ కంపెనీని హైదరాబాద్ నుంచి గుజరాత్ కు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన సాంకేతి అంశాల్ని పూర్తి చేసే పనిలో ఆ కంపెనీ నిమగ్నమైందని చెబుతున్నారు. దాదాపు 15 దేశాల్లో నేరుగా విత్తన వ్యాపారం చేసే అడ్వాంటా హైదరాబాద్ నుంచి తన వ్యాపార కేంద్రాన్ని గుజరాత్ కు ఎందుకు మార్చాలన్న దానిపై ఎవరూ సరైన కారణాన్ని చెప్పలేకపోతున్నారు.
మార్కెట్ లో వినిపిస్తున్న అంచనాలన్నీ కాకమ్మ కబుర్లుగా పలువురు కొట్టిపారేస్తున్నారు. ఈ వ్యవహారంపై వినిపిస్తున్న పలు అంచనాల్లో వాస్తవానికి కాస్త దగ్గరగా ఉన్న కారణంగా చూస్తే మాత్రం.. గుజరాత్ కేంద్రంగా పని చేసే యూనైటెడ్ ఫాస్పరస్ లిమిటెడ్ కు అడ్వాంటాలో 49 శాతానికిపైనే వాటా ఉండటం.. గుజరాత్ సర్కారు అనుకూల ప్యాకేజీ ఆఫర్ చేయటంతో తమ సంస్థను హైదరాబాద్ నుంచి గుజరాత్ తరలించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మరి.. ఇందులో వాస్తవం ఏమిటో అధికారికంగా బయటకు రావాల్సి ఉంది. ఓవైపు కొత్త కంపెనీల కోసం కేసీఆర్ సర్కారు కాలికి బలపం కట్టుకొని మరీ తిరుగుతుంటే.. మరోవైపు కంపెనీలు వెళ్లిపోతే ఇబ్బందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి ఇబ్బంది కలిగే ఇలాంటి ప్రయత్నాల్ని ముఖ్యమంత్రి స్వయంగా దృష్టి సారించాలని కోరుతున్నారు.