Begin typing your search above and press return to search.

చీఫ్ జస్టిస్ లైంగిక ఆరోపణల కేసు..కొత్త మలుపు

By:  Tupaki Desk   |   22 April 2019 9:18 AM GMT
చీఫ్ జస్టిస్ లైంగిక ఆరోపణల కేసు..కొత్త మలుపు
X
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పై ఇటీవల లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులో పనిచేసిన మాజీ మహిళా ఉద్యోగి ఈ మేరకు ఆరోపణలు చేసింది.. 22మంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు ఫిర్యాదు చేసి కలకలం సృష్టించింది. ఇది దేశవ్యాప్తంగా దుమారం రేగిన వేళ దీని వెనుక కుట్ర ఉందని.. ‘చాలా పెద్ద శక్తి’ దీనివెనుక పన్నాగం పన్నాడని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పుడు తాజాగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆరోపణలకు బలం చేకూరే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఉత్సవ్ బెయిన్స్ ఈ కేసులో కుట్రకోణాన్ని బయటపెట్టారు. తనకు ఈ కేసు వాదించాలని.. రంజన్ గొగోయ్ కు వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహిస్తే లీగల్ ఫీజుగా రూ.50 లక్షలు ఇస్తామని ఆశచూపారని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. తనకు అనుమానం వచ్చి ఈ కేసు వాదించనని అంటే.. ఆ వ్యక్తి రూ.1.5కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చాడని పేర్కొన్నారు. లైంగిక ఆరోపనలు చేసిన మహిళతో ఇతడికి సంబంధం ఏంటనే విషయాన్ని అతడు చెప్పలేదన్నారు. అతడిని వెళ్లగొట్టిన తాను ఈ విషయంపై సీజేఐ రంజన్ ను కలిసి వివరించడానికి వెళ్లగా ఆయన లేడని చెప్పుకొచ్చాడు.

రంజన్ గొగోయ్ కు వ్యతిరేకంగా ఏదో కుట్ర జరుగుతోందని.. దీనిపై తాను వివరాలు సేకరించానని.. సీజీఐ చేత రాజీనామా చేయించడానికి మహాకుట్ర జరుగుతోందని అర్థమైందని ఉత్సవ్ బెయిన్స్ తెలిపారు. తనకు సీజేఐతో ఇప్పటివరకు ఎలాంటి వ్యక్తిగత పరిచయం లేదని.. తాను సీజేఐను కాపాడేందుకు ఇవన్నీ చెప్పడం లేదని.. ఆయన్ను ఇరికించాలని చేస్తున్న కుట్రనే బయటపెట్టానని ఉత్సవ్ తెలిపారు. దీనిపై ఎవరైనా రుజువుచేస్తే న్యాయవాద వృత్తినే వదిలేస్తానని సవల్ విసిరారు.