Begin typing your search above and press return to search.
ఆ ఎస్పీపై బదిలీ వేటు పడింది!
By: Tupaki Desk | 17 July 2018 4:23 AM GMTబాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వారు ఆచితూచి అడుగులు వేయాలి. అప్రమత్తతో ఉండాలి - వ్యామోహాల మోజులో పడకూడదు. కానీ.. తన బాధ్యతను మరచి.. పరాయి వ్యక్తి భార్యతో సన్నిహితంగా ఉన్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగళూరు రూరల్ జిల్లా ఎస్పీ ఉదంతం సంచలనంగా మారింది. తన భార్యతో సన్నిహితంగా ఉన్నారంటూ ఎస్పీపై టెకీ ఒకరు చేసిన ఆరోపణలు పెద్ద ఎత్తున కలకలం రేపాయి.
ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం ఇరుకున పడింది. దీంతో.. చర్యలకు ఉపక్రమిస్తూ.. బదిలీ వేటు వేశారు. బెంగళూరు రూరల్ జిల్లా ఎస్పీ తీరు సంచలనంగా మారింది. పరాయి మహిళతో జరిపిన రాసలీలల వీడియో బయటకు రావటంతో ఆయనపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఎస్పీ తీరు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. టెకీ భార్యతో సన్నిహితంగా ఉన్న వీడియోలు మీడియాలో పెద్ద ఎత్తున టెలికాస్ట్ కావటంతో ఈ వ్యవహారం సీరియస్ గా మారింది.
తొలుత ఈ వైనంపై పోలీసు అధికారులు.. ప్రభుత్వం పట్టనట్లే వ్యవహరించాయి. అయితే.. మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగటం.. దీనిపై ప్రజల్లో జరుగుతున్న చర్చ నేపథ్యంలో అలెర్ట్ అయిన ప్రభుత్వం చర్యలకు దిగింది.ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని డీజీపీ నీలమణి రాజుకు ఉప ముఖ్యమంత్రి కమ్ హోంమంత్రి పరమేశ్వర్ కోరారు. ఈ ఇష్యూపై వివరాలు తెలుసుకునేందుకు డీజీపీని ప్రత్యేకంగా పిలిపించి.. వివరాలు సేకరించారు.
అనంతరం ఎస్పీను ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా వేకెన్సీరిజర్వ్ కు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. వీడియోలో ఉన్న మహిళ మాత్రం తన భర్త తనను వేధించేవాడని.. అందుకే ఇలా రచ్చకు ఈడుస్తున్నాడని వాపోయింది. ఎస్పీతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. మరోవైపు ఆమె భర్త మాత్రం తన భార్యకు ఎస్పీ నుంచి ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్పీకి సంబంధించి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాజకీయ నాయకులకు సన్నిహితంగా ఉంటే పోలీసు ఉన్నతాధికారి నేతలు కోరినట్లుగా అనేకమంది అమాయకుల్ని కేసుల్లో ఇరికించేవాడని బాధితులు వాపోతున్నారు. ఆయనకు సంబంధించి పలు ఫిర్యాదులు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.