Begin typing your search above and press return to search.
స్వాములు.. తెలుగు రాష్ట్రాల సీఎంలు... ఈ లింకులేంటి...!
By: Tupaki Desk | 22 Oct 2021 3:30 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వాములతో ఉన్న అనుబంధం ఎంత చెప్పినా తక్కువే. ఏపీ సీఎం జగన్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు కూడా.. మఠాధిపతులు, పీఠాధిపతులతో అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. అటు కేసీఆర్.. త్రిదండి చినజీయర్ స్వామిని.. ఇటు ఏపీ సీఎం విశాఖ చినముషిడివాడలో ఉన్న శారదాపీఠాధిపతిని ఎంతగా నమ్ముతున్నారో.. పూజిస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ జాబితాలోకి మరో స్వామి వచ్చి చేరారు. ఆయనే గణపతి సచ్చిదానంద స్వామి. ఇప్పటి వరకు ఏపీ సీఎంలు ఎవరూ కూడా ఆయన వద్దకు నేరుగా వెళ్లింది లేదు.
కానీ, ఇప్పుడు జగన్ మాత్రం.. తొలిసారి విజయవాడలోని దత్తపీఠానికి వెళ్లి.. గణపతి సచ్చిదానంద స్వామిని దర్శించుకున్నారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. సీఎం జగన్‌కు ఇప్పుడు పాలనలో తీవ్ర ఇబ్బందులుఎదురవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆర్థిక పరమైన సమస్యలను ఆయన ఎదుర్కొంటున్నారు. నెల నెలా అప్పుల కోసం ఢిల్లీకి పరుగుపెడుతున్న పరిస్థితి అందరికీ తెలిసిందే. దీనికితోడు.. ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నా.. అనుకున్న రేంజ్‌లో మాత్రం ఆయనకు గ్రాఫ్ పెరగడం లేదు. ఈ పరిణామాలతో వైసీపీ అధినేత సతమతం అవుతున్నారు..
ఇవన్నీ ఇలా.. ఉంటే.. మరోవైపు..కేసుల కత్తి వేలాడుతూనే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో .. అనే చర్చ వైసీపీలో కనిపిస్తోంది. దీనిపై జగన్ ఆప్తమిత్రుడు, విశాఖపట్నం స్వామి.. ఇచ్చిన సూచలన మేరకే జగన్.. విజయవాడలోని దత్తపీఠాన్ని దర్శించుకున్నారని.. వైసీపీ వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది. ప్రస్తుతం సీఎం జగన్‌కు శనిదోషం నడుస్తోందని.. అదే సమయంలో శుక్ర దోషం కూడా నడుస్తోందని.. అందుకే ఆయన గణపతి సచ్చిదానంద స్వామిని కలిసి వచ్చారని.. ప్రచాం సాగుతోంది.
ఇదిలావుంటే.. త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గణపతి సచ్చిదానంద సస్వామి ఆశీస్సుల కోసం రానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో అది ముగియగానే కేసీఆర్ కూడా విజయవాడకు వచ్చి గణపతి స్వామిని దర్శిస్తారని అంటున్నారు. మొత్తానికి స్వాములు-సీఎంలపై చర్చ బాగానే సాగుతుండడం గమనార్హం.