Begin typing your search above and press return to search.
అఫ్గాన్ సంక్షోభం మన జేబుల్ని ఖాళీ చేయిస్తుందా?
By: Tupaki Desk | 20 Aug 2021 11:31 AM GMTప్రపంచం కుగ్రామంగా మారింది. ఒకరితో ఒకరికి సంబంధాలు లేకుండా ఉండలేని పరిస్థితి. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా దాని ప్రభావం అందరి మీదా పడే దుస్థితి. అప్పుడెప్పుడో కువైట్.. ఇరాక్ మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆయిల్ ధరలు ఎంతలా మండిపోయాయో తెలిసిందే. తాజాగా అఫ్గానిస్థాన్ లో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభం ఇప్పుడు దేశ ప్రజల జేబుల మీద భారం పడేలా చేయనుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం.. ఇంతకాలం మనం అఫ్గాన్ మీద ఆధారపడటమే.
మారిన జీవనశైలితో పాటు.. కరోనా కారణంగా డ్రైఫ్రూట్స్ ను విపరీతంగా తినటం ఎక్కువైంది. గతంలో కొన్నిస్వీట్లలో మాత్రమే వినియోగించే డ్రైఫ్రూట్స్ ను.. తినే ప్రతి వస్తువులోనూ ఉండేలా చేయటం ఈ మధ్యన ఎక్కువైంది. గతంలో కేజీ బాదం పప్పు కొనటం అన్నది తెలీని ఎన్నోకుటుంబాలు.. ఇప్పుడు నెలావారీగా కేజీ బాదం కొనుగోలు చేయటం ఒక అలవాటుగా మారింది. ఒక్క బాదం మాత్రమే కాదు.. మరెన్నో డ్రైఫ్రూట్స్ ను కొనుగోలు చేయటం ఎక్కువైంది.
బాదం.. పిస్తా.. అంజీర్.. ఆప్రికాట్ లాంటి పంటలకు అఫ్గాన్ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. మన దేశంలో దిగుమతి అయ్యే డ్రైఫ్రూట్స్ లో 85 శాతం అఫ్గాన్ నుంచే దిగుమతి అవుతాయి. ఇప్పుడు తాలిబన్ల రాజ్యం మొదలైన తర్వాత నుంచి ఆఫ్గాన్ నుంచి రావాల్సిన డ్రై ఫ్రూట్స్ భారత్ కు రాకుండా ఆపేసినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో బాదం.. వాల్ నట్స్.. ఆఫ్రికాట్స్ వంటి డ్రైఫ్రూట్స్ ధరలు రెండు..మూడు రెట్లు పెరిగాయని.. రానున్నదంతా పండుగ సీజన్ కావటంతో ధరలు మరింత పెరగటం ఖాయమంటున్నారు. ఇఫ్పుడున్న పరిస్థితుల్లో డ్రైఫ్రూట్స్ ఆఫ్గాన్ నుంచి రాని పక్షంలో ఇబ్బందికరపరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఆఫ్గాన్ నుంచి మనకు డ్రైఫ్రూట్స్ వస్తే.. మన నుంచి ఆఫ్గాన్ కు తేయాకు.. కాఫీ.. మిరియాలు.. బొమ్మలు.. పత్తి.. చెప్పులు లాంటి వస్తువులు ఎగుమతి అవుతుంటాయి.తాలిబన్ల ఎపిసోడ్ తో ఇప్పటికే దేశంలో డ్రైఫ్రూట్స్ ధరలు పెరిగాయని.. మరికొద్ది రోజుల్లో మరింత ఎక్కువ కావటం ఖాయమని చెబుతున్నారు.