Begin typing your search above and press return to search.
బైడెన్ కుర్చీకే ఎసరు పెడుతున్న ఆఫ్గాన్ ఎపిసోడ్
By: Tupaki Desk | 29 Aug 2021 12:30 AM GMTప్రపంచాన్ని ప్రభావితం చేసే పెద్దన్నకు తొలిసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అఫ్గాన్ ఎపిసోడ్ పై అగ్రరాజ్యం వేసుకున్న అంచనాలు తప్పు కావటమే కాదు.. ప్రపంచ దేశాల ముందు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఇది సరిపోనట్లు రెండు రోజుల క్రితం కాబూల్ ఎయిర్ పోర్టు వెలుపల చోటు చేసుకున్న జంట పేలుళ్లలో 200 మంది మరణించటం.. అందులో అమెరికన్ సైనికులు 13 మందికిపైనే ఉండటం.. పెద్ద సంఖ్యలో క్షతగాత్రులు కావటంపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమెరికన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు.. అఫ్గాన్ ఇష్యూను సరిగా హ్యాండిల్ చేయటంలో బైడెన్ ఫెయిల్ అయ్యారన్న వాదన ఇప్పుడు ఊపందుకుంది. ప్రపంచ దేశాల ముందు అమెరికాకు ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది.
దీనికి తోడు మాజీ అధ్యక్షుడు ట్రంప్ సైతం సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓపక్క కరోనా తీవ్రత పెరగటం..మరోవైపు అఫ్గాన్ లో అమెరికాకు తగిలిన ఎదురుదెబ్బ మీదా విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. అఫ్గాన్ మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లటంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు ఇరవై ఏళ్ల నుంచి లక్షల కోట్ల రూపాయిలు ఖర్చు చేసి.. చివరకు రాక్షసుల చేతికి కోట్లాది మంది అఫ్గాన్లను అప్పజెప్పటాన్ని ప్రపంచ దేశాల్లోని ప్రజలు తప్పు పడుతున్నారు.
అమెరికన్ సైనికుల్ని ఉపసంహరించుకోవటం వల్లే అఫ్గాన్ ప్రజల జీవితాల్లో చీకట్లు అలుముకున్నట్లుగా బావిస్తున్నారు. తాలిబన్ల సామర్థ్యాన్ని.. వారి బలాన్ని తక్కువగా అంచనా వేయటంలో బైడెన్ విఫలమైనట్లు అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల కోసం ఎదురుచూస్తున్న ట్రంప్ తన గళాన్ని వినిపిస్తున్నారు. తానే కనుక అమెరికా అధ్యక్షస్థానంలో ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. బైడెన్ తన పదవికి రాజీనామా చేసి.. వైట్ హౌస్ నుంచి బయటకు వెళితే మంచిదన్నారు.
కాబూల్ లో చోటు చేసుకున్న జంట పేలుళ్ల అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ సందర్భంలో.. అమెరికన్ సైనికుల మరణాలు.. అఫ్గాన్ పరిస్థితులు.. అమెరికా వైఫల్యంపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక.. కాసేపు మౌనంగా.. తల దించుకొని ఉండటం.. తీవ్ర భావోద్వేగానికి గురి కావటం చూస్తే.. తాజా పరిస్థితులు బైడెన్ కు ఇబ్బందికరంగా మారిందన్న మాట వినిపిస్తోంది. అఫ్గాన్ లో చోటు చేసుకున్న పరిణామాల తర్వాత అమెరికా ఇమేజ్ దారుణంగా దెబ్బ తిందని.. ప్రపంచ దేశాలు సైతం అమెరికాను వేలెత్తి చూపించటాన్ని అమెరికన్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
తాజా పరిణామాలతో బైడెన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఆయన రాజీనామాకు రిపబ్లికన్లు డిమాండ్ చేస్తున్నారు. అప్గాన్ లో చిక్కుకున్న అమెరికన్లను క్షేమంగా తీసుకొచ్చేలా చేయటంలో బైడెన్ సర్కారు ఫెయిల్ అయినట్లుగా విశ్లేషణలు ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బైడెన్ మీద ఒత్తిడి పెరుగుతోంది. ఇదే సమయంలో బైడెన్ కు బదులుగా ఉపాధ్యక్ష స్థానంలో ఉన్న కమలా హారిస్ ను అధ్యక్షరాలిగా నియమిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధ్యక్ష స్థానంలో కూర్చున్న ఏడు నెలల్లోనే ఆయన ఇంతటి ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవటం డెమొక్రాట్లు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తంగా అఫ్గాన్ వ్యవహారాలు బైడెన్ ప్రభుత్వాన్ని ఎక్కడికి తీసుకెళతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.