Begin typing your search above and press return to search.

అప్ఘన్ ఆర్థిక మంత్రి ఇప్పుడు అమెరికాలో ఉబర్ డ్రైవర్

By:  Tupaki Desk   |   22 March 2022 2:30 PM GMT
అప్ఘన్ ఆర్థిక మంత్రి ఇప్పుడు అమెరికాలో ఉబర్ డ్రైవర్
X
ఆగస్టు 2021లో తాలిబాన్లు దేశాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసిన ఖలీద్ పయెండా ఇప్పుడు దుర్భర జీవితాన్ని గడుపుతున్నాడు. అమెరికాలో ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారని సంచలన వార్త తాజాగా వైరల్ గా మారింది.

"ప్రస్తుతం, నాకు స్థలం లేదు, నేను ఇక్కడ ఉండను.. నేను అక్కడ అప్ఘనిస్తాన్ లో కూడా ఉండలేను" అని అప్ఘన్ ఆర్థిక మంత్రిగా చేసిన పాయెండ తెలిపారు.

ఉబెర్‌ కారును నడుపుతున్న పయెండా తాజాగా తన ఆవేదనను వెళ్లగక్కాడు. హోండా అకార్డ్ కారు తీసుకొని రోజువారీకి క్యాబ్ డ్రైవర్ గా ఇలా చేస్తున్నానని వాపోయాడు. "నేను రాబోయే రెండు రోజుల్లో 50 ట్రిప్పులను పూర్తి చేస్తే, నాకు 95 డాలర్ల బోనస్ అందుతుందని ఒక దేశ ఆర్థిక మంత్రిగా చేసిన వ్యక్తి పేర్కొనడం చూసి అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఖలీద్ పయెండా జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో అనుబంధ ప్రొఫెసర్‌గా కూడా పనిచేస్తున్నాడు.

తాలిబాన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకోవడానికి ఒక వారం ముందు పయెండా, ఘనీతో సంబంధాలు క్షీణించడంతో ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేశారు.

తాలిబన్లు తనను అరెస్టు చేస్తారనే భయంతో.. అతను అమెరికాకి వెళ్లిపోయాడు, అక్కడ తన కుటుంబంతో కలిసి ఉబెర్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.