Begin typing your search above and press return to search.

పాక్ కు పారిపోయిన ఆఫ్ఘన్ మహిళా ఫుట్ బాల్ టీం.. ఎందుకంటే

By:  Tupaki Desk   |   16 Sep 2021 6:44 AM GMT
పాక్ కు పారిపోయిన ఆఫ్ఘన్ మహిళా ఫుట్ బాల్ టీం.. ఎందుకంటే
X
అఫ్ఘనిస్తాన్ లో పాలన గాడి తప్పింది అనే భావన చాలా బలంగా నాటుకుపోయింది. తాము మారిపోయామని, అందరికీ క్షమాభిక్ష పెట్టామని చెబుతున్నా, చేతల్లో మాత్రం అదే క్రూరత్వం, పిచ్చి నిర్ణయాలు అమలు చేస్తుండడంతో భయం భయంగానే బతకాల్సి వస్తోంది. గత ఆగస్టు 15వ తేదీన కాబుల్ ను ఆక్రమించిన తర్వాత అమ్మాయిలు, మహిళలు ఇళ్లు దాటి బయటకు వచ్చేందుకు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని రోజుపాటు మౌనంగా ఉన్నా భరించలేక నిరసనలకు దిగుతున్నారు. అప్ఘాన్ ను వశం చేసుకున్న తాలిబన్లు రెచ్చిపోతున్నారు.

వ్యతిరేకించిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆంక్షలు, నిబంధనల మధ్య ప్రజలు బతుకుతున్నారు. మహిళలే టార్గెట్ చేస్తూ..తాలిబన్లు రెచ్చిపోతున్నారు. క్రీడలపై కూడా పలు నిబంధనలు జారీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇతర దేశాలకు వెళ్లేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు.కానీ, కాబూల్ ఎయిర్ పోర్టు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో సాధ్యం కావడం లేదు. ఇదిలా ఉంటే మహిళల ఫుట్ బాల్ టీం, పాక్ కు సురక్షితంగా చేరుకుంది. తాలిబన్ల నుంచి మహిళా ఫుట్ బాలర్లకు ముప్పు ఉండడంతో 32 మంది కుటుంబసభ్యులతో పొరుగుదేశమైన పాక్ లో అడుగుపెట్టారు. వాస్తవానికి ఈ జట్టు ఖతార్ కు బయలుదేరాల్సి ఉంది. కాబూల్ అంతర్జాతీయ విమానశ్రాయం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో అక్కడకు వెళ్లే వీలు కాలేకపోయింది.

దీంతో తాలిబన్ల కళ్లు గప్పి పాక్ కు చేరుకుంది. పురుషుల క్రీడలకు తాలిబన్లు ఓకే చెప్పినా, మహిళలు షరియా చట్టల ప్రకారం ఆటలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు తాలిబన్లు. దీనిపై మహిళా ఫుట్ బాలర్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. వారిని తాలిబన్లు నిర్భించాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలో బ్రిటన్ కు చెందిన ఎన్జీవో సహకారంతో ఫుట్ బాలర్లకు పాక్ అత్యవసర వీసాలు జారీ చేసింది. పాక్ లో దిగిన వీరికి పెషావర్ లేదా లాహోర్ లో బస ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.