Begin typing your search above and press return to search.
తాలిబన్లు రాకముందు అప్ఘనిస్తాన్ మహిళలు ఎలా ఉండేవారంటే?
By: Tupaki Desk | 17 Aug 2021 12:30 AM GMT20 ఏళ్లు అమెరికా అండతో ప్రజాస్వామ్య వాసనలు చూసిన అప్ఘనిస్తాన్ దేశం ఇప్పుడు పూర్తిగా తాలిబన్ల వశమైంది. అక్కడ తాలిబన్లు అధికార పాలన ప్రారంభమైంది. దీంతో ప్రజలకు స్వేచ్చ లేకుండా పోయింది. ముఖ్యంగా మహిళలు, బాలికలు దొరికితే కిడ్నాపులు చేస్తూ తాలిబన్లు అత్యాచారాలకు దిగుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మహిళలకు అప్ఘనిస్తాన్ లో స్వేచ్ఛ లేకుండా పోయిందంటున్నారు.
తాలిబన్ల పాలన మొదలు కావడంతో ఇక అప్ఘనిస్తాన్ మహిళలకు ఉద్యోగాలు చేయడం.. బహిరంగంగా తిరగడానికి వీలు లేదని ఉగ్రమూకలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇక వంటింటి కుందేళ్లలాగా ఇంటికే అప్ఘనీ మహిళలు పరిమితం కావాల్సి ఉంటుంది. లేదంటే తాలిబన్ల చేతిలో మాన, ప్రాణాలు వదులుకోవాల్సి ఉంటుంది.
అయితే తాలిబన్లు రాకముందే ఆ దేశ రాజధాని కాబూల్ లో మహిళలు స్వేచ్ఛగా తిరిగేవారు. 2001లో అమెరికా నాయకత్వంలో నాటో దళాలతో అధికారం నుంచి తొలగించబడిన తాలిబన్లు, 20 ఏళ్ల తర్వాత తిరిగి అప్ఘనిస్తాన్ ను చెరబట్టారు.
తాజా నివేదికల ప్రకారం తాలిబన్లు ఆక్రమించిన ప్రాంతాల్లో క్రూరమైన చట్టాలను తాలిబన్లు అమలు చేస్తున్నారు. దీనిపై మహిళలపై తీవ్ర ఆంక్షలు విధించబడ్డాయి. 15 ఏళ్లు పైబడిన బాలికలు, 45 ఏళ్లలోపు వింతంతు మహిళ జాబితాను సమర్పించాలని వారు కోరారు.
తాలిబన్లు ఆక్రమిత ప్రాంతాల్లో మాత్రమే మహిళలను బలవంతంగా వివాహం చేసుకుంటున్నారు. మహిళలు ఇంటి నుంచి బయటకు రాకుండా నిషేధించారు. బయటకొస్తే బురఖా ధరించాలి. విద్య నిషేధించబడింది.
అయితే ఇప్పుడు కాబూల్ లో ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు పురాతన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఒకప్పుడు అప్ఘనీ మహిళలు యూరోపియన్లుగా ఫ్యాషన్ గా ఉండేవారని ఫొటోలు బట్టి తెలుస్తోంది. కానీ తాలిబన్ల రాకతో మహిళలకు అసలు రక్షణ, మాన, ప్రాణాలకు విలువలేకుండా పోయింది. అప్ఘనిస్తాన్ లో తాలిబన్లు రాకముందే బురఖా లాంటివి లేకుండా ఆధునిక దుస్తులు ధరించి అప్ఘనీ మహిళలు బయట తిరుగుతున్న ఫొటోలు ఫ్యాషన్ దుస్తులు హెయిర్ స్టైల్ ఫొటోలు వైరల్ గా మారాయి. 1979లో రష్యా సైన్యం అప్ఘనిస్తాన్ ఆక్రమించినప్పుడు స్కర్టులు ధరించి ఫిల్మ్ షోలకు వెళుతున్న అప్ఘనీ అందమైన మహిళల ఫొటోలు తీశారు. కాబూల్ యూనివర్సిటీకి చదువుకునేందుకు వెళ్లారు. 1919లోనే ఓటు వేసే స్వేచ్చను అప్ఘన్ మహిళలు పొందారు. ఎంతో స్వేచ్ఛను అనుభవించిన మహిళలు ఇప్పుడు అత్యంత దారుణంగా తాలిబన్ల చేతుల్లో బలవుతున్నారని నెట్టింట్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలనతో ఇప్పుడు మహిళల భద్రత ఎండమావి అయ్యింది. విడాకులు తీసుకున్న మహిళల పరిస్థితి మరింత విషమంగా తయారైంది.