Begin typing your search above and press return to search.
ఆఫ్ఘనిస్తాన్ ఏరివేత.. సైన్యం కాల్పుల్లో 12 మంది తాలిబన్లు హతం
By: Tupaki Desk | 22 July 2020 4:03 PM GMTఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ఏరివేత ముమ్మరం చేస్తోంది. తమ దేశంలో తలదాచుకున్న వారిని వెతికి వెతికి కాల్చి చంపుతోంది. అదే క్రమంలో తాజాగా సోమవారం రాత్రి మరోసారి ఆ దేశ సైనికులు తాలిబన్లపై విరుచుకుపడ్డారు. తాజాగా జరిపిన కాల్పుల్లో ఏకంగా 12 మంది తాలిబన్లు హతమయ్యారు. తాలిబన్లకు, ఆర్మీకి మధ్య పరోక్ష యుద్ధం జరుగుతోంది. కొద్ది రోజులుగా ఆఫ్ఘన్ సైన్యం లక్ష్యంగా తాలిబన్లు దాడులకు దిగుతుండడంతో ఆ దేశ సైనికులు ధీటుగా సమాధానం ఇస్తున్నారు.
తాజాగా కాందహార్ ప్రావిన్స్‌లోని తక్ట్ ఏ పొల్ పట్టణంలో సోమవారం రాత్రి తాలిబన్ ఉగ్రవాదులు లక్ష్యంగా నాటో రెస్క్యూ టీం ఎయిర్ స్ట్రైక్ చేపట్టింది. ఈ ఘటనలో 25 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో 12 మంది పాకిస్థానీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కాందహార్ పోలీసు అధికారులు తెలిపారు. మరణించిన పాకిస్థానీయులు తాలిబన్లకు సహాయంగా ఉంటూ పోరాడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంతకుముందు తాలిబన్లు ఆఫ్ఘన్ ఆర్మీ పోస్టులను లక్ష్యంగా చేసుకుని అనేక దాడులకు పాల్పడ్డారు. దీంతో వారిపై సైన్యం ప్రతీకారం తీర్చుకుంటోంది. ఈ క్రమంలోనే సైన్యం జరిపిన దాడుల్లో దాదాపు పదుల సంఖ్యలో తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.