Begin typing your search above and press return to search.
నార్కో టెస్ట్ కు ఆఫ్తాబ్.. అసలు నిజాలు బయటికి వచ్చేనా?
By: Tupaki Desk | 30 Nov 2022 2:30 AM GMTసహజీవన భాగస్వామి శ్రద్దా కపూర్ ను అత్యంత దారుణంగా హతమార్చిన కేసులో నిందితుడిగా ఉన్న ఆఫ్తాబ్ అమిన్ పునావాలాను నార్కో టెస్ట్ చేసేందుకు గాను ఢిల్లీ పోలీసులకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఆఫ్తాబ్ కు పోలీసులు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించింది. తాజాగా నార్క్ టెస్ట్ కు అనుమతి ఇవ్వడంతో అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశముంది. .
శ్రద్ధా వాకర్ ను నిందితుడు 35 ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో పెట్టి.. రాత్రిపూట పలు ఏరియాల్లో ఆ భాగాలను విసిరివేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ హత్య కేసులో శ్రద్ధా వాకర్ సహజీవన భాగస్వామి అయిన అఫ్తాబ్ అమిన్ పూనా వాలా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
ఈ కేసులో దర్యాప్తు సంస్థలు ఇప్పటికే నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్ ను నిర్వహించాయి. ఢిల్లీ కోర్టు తాజాగా నిందితుడికి నార్కో టెస్ట్ కు సైతం అనుమతి ఇచ్చిందని ఆఫ్తాబ్ తరుపు న్యాయవాది అభినాశ్ కుమార్ స్వయంగా మీడియాకు తెలియజేశాడు. డిసెంబర్ 1.. 5 తేదిల్లో రోహిణీలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీలో నిందితుడికి పోలీసులు నార్కోటెస్ట్ చేయనున్నారు.
ఈ మేరకు ఢిల్లీ పోలీసులు నార్కో టెస్ట్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ పరీక్షలో భాగంగా నిందితుడి వయస్సును బట్టి శరీరంలోకి ట్రూత్ సీరం అనే ఔషధాన్ని ఎక్కిస్తారు. దీంతో ఆ వ్యక్తి కొన్ని సెకన్లలో స్పృహ కోల్పోతాడు. ఆ సమయంలో నిందితుడి నాడి వ్యవస్థను ప్రభావితం చేసి పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానాలను రాబడుతారు.
అదే సమయంలో అతడి బీపీ.. పల్స్ ను నిపుణులు అనుక్షణం చెక్ చేస్తుంటారు. ఒకవేళ నిందితుడి పల్స్ పడితే వెంటనే ఆక్సిజన్ అందిస్తారు. ఈ నార్కోటెస్ట్ లో వ్యక్తి ఇచ్చే స్టేట్ మెంట్ ఆధారంగా దర్యాప్తు సంస్థలు కేసులో ముందుకెళ్లే అవకాశముంది. గతంలోనూ దర్యాప్తు సంస్థలు పలు కీలక కేసుల్లో నార్కో టెస్ట్ నిర్వహించి అసలు విషయాలు బయటకు తెచ్చాయి.
అయితే కోర్టులు మాత్రం నార్కో టెస్ట్ లో వచ్చే అనాసిస్ ను ప్రధాన సాక్ష్యాలుగా పరిగణించవు. వీటికి కేవలం ఆధారాలుగా మాత్రమే తీసుకుంటుంది. ఏది ఏమైనా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు నార్కో టెస్టులో అసలు నిజాలు వెల్లడిస్తాడా? లేదా అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.