Begin typing your search above and press return to search.

11 రోజుల తర్వాత వైరస్ ఇతరులకి సోకదట ..!

By:  Tupaki Desk   |   25 May 2020 8:30 AM GMT
11 రోజుల తర్వాత వైరస్ ఇతరులకి సోకదట ..!
X
ఓ భయంకరమైన మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని భయంతో వణికిపోయేలా చేస్తుంది. అయితే, ఈ వైరస్ వెలుగులోకి వచ్చి ఆరు నెలలు కావొస్తున్నా కూడా ఇప్పటికి ఇంకా వైరస్ గురించి పూర్తిగా ఎవరు చెప్పలేకపోతున్నారు. రోజుకొక విషయం వెలుగులోకి వస్తుంది. తాజాగా సింగపూర్ పరిశోధకులు ఓ మంచి విషయం చెప్పారు. ఏంటంటే సపోజ్ ఓ వ్యక్తికి కరోనా సోకితే... 11 రోజుల తర్వాత, ఆ వ్యక్తి నుంచి ఇతరులకు వైరస్ సోకట్లేదట. 11 రోజుల తర్వాత ఆ వ్యక్తికి వైరస్ ఉన్నా, ఆ వ్యక్తి నుంచి ఇతరులకు కరోనా చేరట్లేదని తేల్చారు.

ఎందుకు అంటే ...ఈ మహమ్మారి సోకిన వారికి ట్రీట్‌మెంట్ ఇస్తారు కాబట్టి... 11 రోజుల్లో ఆ వైరస్‌లో శక్తి తగ్గిపోతుందట. ఇక అది ఇతరులకు వ్యాపించేంత శక్తి లేక... ఆ వ్యక్తితోనే సరిపెట్టుకుంటుందని సింగపూర్ నేషనల్ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షియస్ అండ్ ది అకాడెమీ ఆఫ్ మెడిసిన్ తెలిపింది. సింగపూర్ పరిశోధకులు చెప్పే విషయాన్ని మనం నమ్మొచ్చు. ఎందుకంటే... ఇదివరకు సార్స్ వచ్చినప్పుడు సింగపూర్ సర్వనాశనం అయ్యింది. ఆ తర్వాత నుంచి వాళ్లు వైరస్ ‌లపై లోతైన పరిశోధనలే చేస్తూ సక్సెస్ అవుతున్నారు.

ఇప్పుడు చెప్పిన దాని ప్రకారమైతే, వైరస్ సోకిన వారికి 11 రోజుల వరకే క్వారంటైన్ పెట్టుకోవడం మంచిది. ఆ తరువాత వారిని ఇంటికి పంపేయడం మంచిది... దాని వల్ల ప్రభుత్వాలకూ, డాక్టర్లకూ కూడా భారం తగ్గుతుంది. సింగపూర్‌ లో 73 మందిపై పరిశోధన చేసి ఈ ఫలితాన్ని ప్రకటించారు. ఐతే... ఇప్పటివరకూ సింగపూర్‌ లో వైరస్ నెగెటివ్ వచ్చిన తర్వాతే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తున్నారు. ఇప్పుడు రూల్స్ మార్చుకునే ఆలోచనలో సింగపూర్ ఆరోగ్య శాఖ ఉన్నట్లు తెలిసింది.

కాగా, సింగపూర్‌ లో ఇప్పటివరకూ 31616 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. 23 మంది చనిపోయారు. సోమవారం కొత్తగా 548 మందికి కరోనా వచ్చింది. యాక్టివ్ కేసులు 16717 ఉన్నాయి. సింగపూర్‌ లో ఈ మహమ్మారి ఏప్రిల్ చివర్లో తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగింది. దాన్ని సెకండ్ వేవ్‌ గా గుర్తించారు.