Begin typing your search above and press return to search.
నెలలో మోడీ మాజీ.. ఈ మాట అన్నదెవరో తెలుసా?
By: Tupaki Desk | 20 April 2019 10:54 AM GMTప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ సింఫుల్ గా చెప్పాలంటే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. తాజాగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ మోడీపై మండిపడ్డారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన అసద్.. మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలైన సాధ్వీ ప్రగ్యాసింగ్ ను భోపాల్ నుంచి పోటీకి దించటమా? అంటూ ప్రశ్నించారు.
దేశ భద్రత గురించి స్పీచులు ఇచ్చే ప్రధాని.. ఉగ్రవాదం నిరోధం గురించి అంతులేని ఉపన్యాసాలు ఇస్తారన్నారు. కానీ.. మాలేగావ్ లో మసీదు సమీపంలో బాంబు పేల్చి.. ఆరుగురు అమాయక ప్రాణాల్ని బలిగొన్న కేసులో నిందితురాలైన స్వాధ్వీకి పార్టీ టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై బీజేపీతో పాటు శివసేనను ప్రశ్నించారు.
ఉగ్రవాద దాడి కేసులో నిందితురాలైన సాధ్వీకి టికెట్ ఎలా ఇచ్చారన్న విషయానికి మోడీ.. శివసేన పార్టీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాద దాడి కేసులో నిందితురాలికి టికెట్ ఇవ్వటం అంటే.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం సాగించటమా? అంటూ నిలదీశారు. భోపాల్ ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దింపటంపై ఇప్పటికే పలువురు విమర్శిస్తున్న వేళ.. అసద్ సైతం వారితో గళం కలపటమే కాదు.. నెలలో మాజీ అవుతారంటూ చేసిన వ్యాఖ్య ఇప్పుడు హైలెట్ గా మారింది.