Begin typing your search above and press return to search.

ఇంత రచ్చ అయ్యాక.. సారీ చెప్పేసిన ఊర్వశి

By:  Tupaki Desk   |   14 Sep 2022 4:23 AM GMT
ఇంత రచ్చ అయ్యాక.. సారీ చెప్పేసిన ఊర్వశి
X
తన అందంతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసే బాలీవుడ్ బ్యూటీ కమ్ కాంట్రావర్సీ క్వీన్ గా చెప్పుకునే ఊర్వశి రౌతాలా ఎట్టకేలకు దిగి వచ్చింది. ఇంటర్వ్యూలో 'ఆర్పీ' పేరుతో రచ్చ షురూ చేసిన అమ్మడు.. తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అదే పనిగా పోస్టులు పెట్టేసి.. బోలెడంత మీడియా అటెన్షన్ ను సొంతం చేసుకున్న ఆమె.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేతులు జోడించి మరీ సారీ చెప్పేసింది.

అయితే.. ఇక్కడ ఇంటర్వ్యూ చేసిన రిపోర్టర్.. ఆర్పీకి ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? అంటూనే రిషబ్ అన్న మాటను ప్రస్తావించిన తర్వాత.. ఏం చెబుతానంటూ నవ్వేసి.. ఆ వెంటనే రెండు చేతులు జోడించి.. సారీ చెప్పేసింది. ఇదంతా చూసిన వారికి ఇంతకాలం ఇష్టారాజ్యంగా అనేసిన మాటల సంగతో? అన్న సందేహం రాక మానదు. ఇంతకీ ఈ వివాదం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. ఊర్వశి రౌతాలా ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో 'ఆర్పీ' అనే వ్యక్తి తన కోసం ఎయిర్ పోర్టులో గంటల తరబడి వెయిట్ చేశాడని.. ఆ సమయంలో తాను హోటల్లో షూటింగ్ బడలికతో నిద్రపోయానని.. నిద్ర లేచేసరికి పదిహేను.. పదహారు మిస్డ్ కాల్స్ ఉన్నట్లుగా చెప్పి.. ఆ తర్వాత తామిద్దరం కలిసినట్లుగా చెప్పుకొచ్చింది.

ఆమె నోటి నుంచి వచ్చిన ఆర్పీ మాటకు టీమిండియా యువ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ రిషభ్ పంత్ అని అనుకోవటం.. ఆ తర్వాత పంత్ రియాక్టు అవుతూ.. కౌంటర్ ఇచ్చారు. కొందరు ప్రముఖులుగా కావటం కోసం అబద్ధాలు ఆడతారన్న వ్యాఖ్య చేశారు. దీనికి ఊర్వశి మరింత ఘాటుగా రియాక్టు అవుతూ.. తమ్ముడూ.. నువ్వు ఒక పిల్ల బచ్చా.. బ్యాట్.. బంతితో ఆటకే పరిమితం అవ్వు అంటూ ఎక్కెసం చేసింది. ఈ సందర్భంగా పంత్ ను కాసిన్ని మాటల్ని అనేసింది.

ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆర్పీకి మీరేమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? అని అడిగినప్పుడు.. తాను ఏది పడితే అది మాట్లాడనంటున్న వేళ.. సదరు రిపోర్టర్.. రిషిబ్ పంత్ అనటం.. దానికి ఆమె స్పందిస్తూ.. తానేమీ చెప్పగలనంటూ నవ్వేసి..

ఆ వెంటనే రెండు చేతులు జోడించి.. సారీ అని చెప్పేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ మాత్రం దానికి అన్నేసి మాటలు అనేయటం.. నోరు జారటం.. మాట అనిపించుకోవటం లాంటివి చేయటం ఇప్పుడు మాత్రం కాస్తంత భిన్నంగా సారీ అని చెప్పేసి వివాదానికి పుల్ స్టాప్ పెట్టేసే ప్రయత్నం చేయటం ఆసక్తికరంగా మారింది. దీంతో తాను రగిల్చిన అగ్గిని సారీ మాటతో ఆర్పే ప్రయత్నం చేసిందని చెప్పాలి.

మరి.. ఊర్వశి నోటి నుంచి వచ్చిన సారీ మాటకు పంత్ రియాక్షన్ ఏమిటి? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఊర్వశి దిగి వచ్చిందన్న మాట వినిపిస్తోంది. చూస్తుంటే.. అతడితో మళ్లీ స్నేహం కోరుకుంటుందేమో? అన్న కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇటీవల కాలంలో పంత్ దూసుకెళుతున్నాడు. ఉత్తరాఖండ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులు కావటంతో పాటు.. తాజాగా ఐసీసీ ప్రపంచకప్ 2022జట్టుకు ఎంపిక కావటం తెలిసిందే. మొత్తానికి ఊర్వశీ నోటి నుంచి వచ్చిన సారీ మాటలు.. ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.