Begin typing your search above and press return to search.

ఆమంచి - అవంతి!..లైన్‌ లో తోట స‌హా ఐదుగురు

By:  Tupaki Desk   |   13 Feb 2019 2:35 PM GMT
ఆమంచి - అవంతి!..లైన్‌ లో తోట స‌హా ఐదుగురు
X
ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు గ‌డువు ముంచుకొస్తున్న కీల‌క త‌రుణంలో అధికార టీడీపీకి దెబ్బ మీద దెబ్బ ప‌డుతోంది. ఇప్ప‌టికే ప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ టీడీపీకి ఊహించ‌ని విధంగా దెబ్బ కొట్టేసి వైసీపీలో చేరేందుకు మార్గం సుగ‌మం చేసుకున్నారు. నేటి ఉద‌యం టీడీపీకి రాజీనామా చేసిన ఆమంచి... నేరుగా హైద‌రాబాదు చేరుకుని లోట‌స్ పాండ్‌లో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా చంద్రబాబు వైఖ‌రిపై నిప్పులు చెరిగిన ఆమంచి... త‌న‌తో పాటు ఇంకా చాలా మంది నేత‌లు వైసీపీలోకి రానున్నార‌ని కూడా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌లు వెలువ‌డ్డ కాసేప‌టికే టీడీపీకి చెందిన మ‌రో సీనియ‌ర్ నేత‌ - అన‌కాప‌ల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస‌రావు (అవంతి శ్రీ‌నివాస్‌) కూడా పార్టీని వీడుతున్న‌ట్లు వార్త‌లు క‌ల‌క‌లం రేపాయి.

అయితే ఇది ఆమంచి - అవంతిల‌తోనే క‌థ ముగియ‌లేద‌న్న వార్త‌లు టీడీపీని మ‌రింత క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. ఇలా టీడీపీని వీడి వైసీపీలో చేర‌తాని ఊహాగానాలు వినిపిస్తున్న వారి జాబితాలో ఇప్పుడు కొత్తగా టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఆ పార్టీ ట్ర‌బుల్ షూట‌ర్‌ గా ప‌రిగ‌ణిస్తున్న రామ‌చంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కూడా ఉన్నార‌ట‌. కాపు సామాజిక వ‌ర్గంలో మంచి పేరున్న నేత‌గానే కాకుండా త‌న సామాజిక వ‌ర్గానికి సంబంధించి అన్ని పార్టీల్లోని నేత‌ల వ‌ద్ద మంచి ప‌లుకుబ‌డి క‌లిగిన నేత‌గా త్రిమూర్తులుకు మంచి పేరుంది. మొన్న ఆమంచి కూడా తోట త్రిమూర్తులుతో చ‌ర్చించిన త‌ర్వాతే టీడీపీలో ఉండ‌టం వేస్ట‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. చంద్ర‌బాబుతో భేటీ అయ్యేందుకు స‌సేమిరా అన్న కార‌ణంగానే ఆయ‌న‌కు స‌ర్దిచెప్పేందుకు తోట త్రిమూర్తులు ఎంట్రీ ఇచ్చార‌నుకున్నా.. త్రిమూర్తులుతో భేటీ త‌ర్వాత ఆమంచి చంద్ర‌బాబుతో భేటీ అయినా కూడా టీడీపీ వ్యూహం బెడిసికొట్టింది. ఈ నేప‌థ్యంలో త‌న మ‌న‌సులోని మాట‌ను త్రిమూర్తులుకు ఆమంచి చెప్ప‌కుండా ఉండే అవ‌కాశ‌మే లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. నాడు త్రిమూర్తులుతో చ‌ర్చ‌ల సంద‌ర్భంగా త‌మ మ‌ధ్య ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన అంశాల మేర‌కే... ఇంకా చాలా మంది టీడీపీని వీడతార‌ని ఆమంచి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశార‌న్న మాట వినిపిస్తోంది.

ఇక తోట త్రిమూర్తులు విష‌యానికి వ‌స్తే... తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన త్రిమూర్తులు.. కాపు సామాజిక‌వ‌ర్గంలో బ‌ల‌మైన నేతే. అంతేకాకుండా టీడీసీలో సీనియ‌ర్ నేత‌గానూ ఆయ‌న‌కు పేరుంది. అయితే గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచినా... ఆయ‌న సీనియారిటీని ప‌క్క‌న‌పెట్టిన చంద్ర‌బాబు... ఆయ‌న కంటే జూనియ‌ర్ అయిన నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌కు డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చారు. ఇదే వాద‌న‌తో చాలా కాలం నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న త్రిమూర్తులు టీడీపీని వీడేందుకు సిద్ధంగానే ఉన్న‌ట్లుగా స‌మాచారం. అయితే తానొక్క‌డే పార్టీ మార‌డం కాకుండా త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేల‌ను వెంట‌బెట్టుకుని మ‌రీ వైసీపీలోకి చేరాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో తోట టీడీపీని వీడితే... ఆయ‌న‌తో క‌లిసి న‌డిచేందుకు హీన‌ప‌క్షం మ‌రో ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఇదే జ‌రిగితే... ఎన్నిక‌ల ముంగిట టీడీపీకి పెద్ద దెబ్బేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.