Begin typing your search above and press return to search.

కాషాయ కుర్తాలో రాహుల్ గాంధీ?

By:  Tupaki Desk   |   26 Nov 2018 3:26 PM GMT
కాషాయ కుర్తాలో రాహుల్ గాంధీ?
X
ఇండియన్ పాలిటిక్సులో కొన్నాళ్లుగా ఒక ట్రెండు నడుస్తోంది. మోదీ ప్రధాని రేసులోకి వచ్చినప్పటి నుంచి దేశంలో హిందూత్వ భావజాలం ఓపెన్ అయింది. దాని వ్యాప్తిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ సహా పలు పార్టీలు లౌకికత్వం పేరుతో ప్రయత్నాలు చేసినా మోదీదే పైచేయి అయింది. దీంతో వరుసగా ఎన్నికల్లో ఓడిపోతూ దెబ్బతిన్నాక రాహుల్ గాంధీకి ట్రెండ్ అర్థమై తన ట్రెండూ మార్చారు. గుజరాత్ ఎన్నికల సమయంలో టెంపుల్ రన్ మొదలుపెట్టి నిన్నటి కర్ణాటక ఎన్నికల వరకు దాన్ని కొనసాగించారు. ఇప్పుడు మళ్లీ అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ రాహుల్ హిందూ కార్డు వేయడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు.

తాజాగా ఆయన రాజస్థాన్ లో తన ప్రచార కార్యక్రమానికి ముందు పుష్కర్‌ లోని ఆలయానికి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా గోత్ర నామాలు చెప్పాల్సిందిగా పూజారి కోరడంతో ఆయన తన వివరాలు తెలిపారు. ‘నా పేరు రాహుల్‌ గాంధీ. నేను కౌల్‌ బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తిని. నాది దత్తాత్రేయ గోత్రం’ అని తెలిపారు. అంతవరకు బాగానే ఉన్నా ఆ తరువాతే అసలు సంగతి మొదలైంది. మీడియాతో మాట్లాడుతూ హిందూ కార్డు వేశారు.‘నాకు హిందూ దేవతల గురించి తెలీదని భాజపా నేతలు అన్నారు. నేను ఆలయాలకు వెళ్లేటప్పుడు వాళ్లెప్పుడూ చూడలేదా?.నాకు ఆలయాలకు వెళ్లే అలవాటుంది. పదిహేనేళ్ల క్రితం నేను నా కుటుంబంతో కలిసి ఇదే ఆలయానికి వచ్చాను. మావాళ్లతో కలిసి పూజల్లోనూ పాల్గొన్నాను.’ అని తెలిపారు.

దీంతో రాహుల్ తీరుపై సోషల్ మీడియాలో సైటైర్లు పడుతున్నాయి. అయోధ్యలో రామమందిరం కట్టడానికి కూడా రాహుల్ హామీ ఇచ్చేలా ఉన్నారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు... తెల్ల కుర్తా స్థానంలో కాషాయ కుర్తా వేసుకోవాని సూచిస్తున్నారు. భక్తి ఏమాత్రం ఉందో తెలియదు కానీ బిల్డప్ మాత్రం భారీగా ఉందంటూ రాహుల్‌ పై చెణుకులు విసురుతున్నారు.