Begin typing your search above and press return to search.
దొంగపట్టాల కేసు.. ఇరుకున్న వల్లభనేని వంశీ
By: Tupaki Desk | 19 Oct 2019 9:17 AM GMTటీడీపీ హయాంలో చెలరేగిపోయిన నేతలంతా ఇప్పుడు జైలువాసం పడుతున్నారు. ఇప్పటికే చింతమనేని , కూన రవికుమార్ లు అరెస్ట్ కాగా.. సోమిరెడ్డి, కరణం బలరాం లాంటి వాళ్లు కేసుల్లో ఇరుకున్నారు. తాజాగా మరో టీడీపీ నేత, కృష్ణ జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఇరుక్కున్నారు.
ఎన్నికల సమయంలో ఓటర్లకు దొంగ పట్టాలు పంపిణీ చేశారని వల్లభనేని వంశీపై వచ్చిన ఫిర్యాదులు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మొన్నటి ఎన్నికల సమయంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి పేదలకు ఇళ్లస్థలాల పట్టాలు పంపిణీ చేశారని బాపులపాడు తహసీల్దార్ నరసింహారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో టీడీపీ ప్రభుత్వం అండదండలతో వల్లభనేని వంశీ బాపుల పాడు మండలంలోని పలు గ్రామాల్లో తన సంతకం ఫోర్జరీ చేసి ఇళ్ల స్తలాలను పంపిణీ చేశారని తహసీల్దార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
వల్లభనేని వంశీతోపాటు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కూడా ఈ పట్టాలు పంపిణీ చేశారు. దీంతో శుక్రవారం కలమట వెంకటరమణను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే అరెస్ట్ కు నిరసనగా వెంకటరమణ.. సీఎం జగన్, ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంతో ఆ కేసులు కూడా నమోదు చేసి జైలుకు పంపారు.
ఇక వల్లభనేని వంశీ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉండడంతో ఆయనపై కేసు నమోదు చేశారు.ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేస్తారా లేదా అన్నది వేచిచూడాలి.