Begin typing your search above and press return to search.
పేలటానికి సిద్ధంగా ఉన్న టైంబాంబ్ లా కోజికోడ్
By: Tupaki Desk | 3 March 2017 9:46 AM GMTకేరళలోని కోజికోడ్ ఇప్పుడు పేలటానికి సిద్ధంగా ఉన్న టైం బాంబ్ మాదిరిగా మారింది. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక.. అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నట్లుగా చెబుతున్నారు. కేరళలోని అధికారపక్షమైన సీపీఎంకు.. బీజేపీ మాతృసంస్థగా చెప్పే ఆర్ ఎస్ ఎస్ కు మధ్య నడుస్తున్న రచ్చ అంతకంతకూ పెరిగిపోతోంది. ఇటీవల కాలంలో ఆర్ ఎస్ ఎస్ కార్యాలయాల మీద.. నేతల మీదా.. బీజేపీ నేతల మీద సీపీఎం నేతలు దాడులు చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఇదిలా ఉంటే.. తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను ఎవరైనా చంపి.. ఆయన తలను తీసుకొస్తే.. వారికి కోటి రూపాయిల మొత్తాన్ని బహుమతిగా ఇస్తానంటూ మధ్య ప్రదేశ్ కు చెందిన ఆర్ఎస్ఎస్ నేత డాక్టర్ చంద్రావత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రిపై చేసిన తీవ్ర వ్యాఖ్యల్ని పలువురు తీవ్రంగా తప్పు పడుతున్నారు.
ఆర్ ఎస్ ఎస్ నేత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో కేరళలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కోజికోడ్ లోని ఆర్ ఎస్ ఎస్ కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ బాంబు దాడి ఘటనలో ముగ్గురు ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు. వారిని కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఆర్ ఎస్ ఎస్ కార్యాలయం మీద బాంబుదాడి జరిగిన కాసేపటికే.. సీపీఎం కార్యాలయంపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అధికార సీపీఎం కార్యాలయానికి నిప్పు అంటించినట్లుగా తెలుస్తోంది.ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. అక్కడెక్కడో మధ్యప్రదేశ్ కు చెందిన సంఘ్ నేతపరుష వ్యాఖ్యలు చేయటం.. దానికి కేరళలలో రిజల్ట్ రావటం ఒకటైతే.. తమ మీద దాడి చేసింది సీపీఎం కార్యకర్తలేనని సంఘ్ నేతలు ఆరోపిస్తుంటే.. తమ పార్టీ కార్యాలయానికి నిప్పు అంటించింది సంఘ్ కు చెందిన వారేనని అధికారపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా ఒకరికి పోటీగా మరొక వర్గం తీరుతో.. కోజికోడ్ లో ఎప్పుడేం జరుగుతుందన్నది అర్థం కానిదిగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/