Begin typing your search above and press return to search.
ఎల్వీ షోకాజ్ నోటీసుకు ప్రవీణ్ వివరణ వచ్చేసింది
By: Tupaki Desk | 8 Nov 2019 9:20 AM GMTగడిచిన వారం వ్యవధిలో ఏపీ పరిపాలనకు సంబంధించిన కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిదే. పాలనా పరమైన విధానాల్లో ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ అప్పటి సీఎస్ ఎల్వీ సుబ్రహణ్యం నుంచి షోకాజ్ నోటీసులు అందుకున్న జీఏడీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తాజాగా బదులిచ్చారు. తనకిచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ పంపారు.
ప్రవీణ్ ప్రకాశ్ కు నోటీసులు పంపిన తర్వాత ఎల్వీ సీఎస్ కుర్చీ దిగాల్సి రావటం.. అప్రాధాన్యత పోస్టుకు బదిలీ చేయటం లాంటివి తెలిసిందే. అయితే.. తనకిచ్చిన నోటీసుకు ప్రవీణ్ ప్రకాశ్ స్పందిస్తూ.. తాజా సీఎస్ నీరభ్ కుమార్ కు వివరణను పంపారు. ఈ సందర్భంగా ఆయన తన వివరణలో తాను ఎలాంటి పరిపాలనా నిబంధనల్ని ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. అయితే.. తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వటం తనను బాధించినట్లుగా ప్రవీణ్ ప్రకాశ్ పేర్కొన్నారు.
వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కారాలు.. గ్రామ న్యాయాలయాల అంశాల్ని కేబినెట్ మీటింగ్ ఎజెండాలో పొందుపరిచే విషయంలో తాను కచ్ఛితమైన విధానాల్ని పాటించినట్లు స్పష్టం చేశారు. ఏడాదికి రూ.10 కోట్లు ఖర్చు అయ్యే వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కారాలకు ఆర్థిక శాఖ సమ్మతి తీసుకున్న తర్వాత మంత్రి వర్గ సమావేశం ఎజెండాలో పెట్టాలని నిర్ణయించామన్నారు.
ఏయే ప్రాంతాల్లో గ్రామ న్యాయాలయాల్ని ఏర్పాటు చేయాలన్న అంశంపై మరింత చర్చ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే మంత్రివర్గ సమావేశంలో ఎజెండా పెడతామని న్యాయశాఖ కార్యదర్శికి చెప్పిన తర్వాత టేబుల్ ఎజెండాగా పొందుపరిచారన్నారు. అయితే.. న్యాయశాఖ కార్యదర్శిని సంప్రదించి ఆయన అనుమతితోనే ఎజెండా నుంచి తాను తొలగించానే తప్పించి.. మరేం చేయలేదన్నారు. తానీ నిర్ణయం తీసుకునే సమయంలో ప్రధాన కార్యదర్శి కేబినెట్ మీటింగ్ లో ఉండటంతో మధ్యలో వెళ్లి చెప్పాల్సినంత పెద్ద విషయం కాదన్న ఉద్దేశంతో ఆగానని పేర్కొన్నారు. తాను చేసింది తప్పు కాదని.. ప్రొసీజర్ ను ఫాలో అయినట్లు స్పష్టం చేశారు ప్రవీణ్ ప్రకాశ్.