Begin typing your search above and press return to search.
విడిపోయాక ఏపీకి నష్టమనుకుంటే హాయిగా ఉన్నారు
By: Tupaki Desk | 18 Oct 2019 7:30 AM GMTఉమ్మడి రాష్ట్రంలో ఏపీ కారణంగా తాము నష్టపోతున్నట్లుగా తెలంగాణకు చెందిన పలువురు నేతలతో పాటు.. ఉద్యోగ.. విద్యార్థి సంఘాలు ఆరోపిస్తుండేవి. విభజన జరిగితే ప్రయోజనం తెలంగాణకే ఎక్కువన్న అంచనాలు వ్యక్తమయ్యేది. ఆ కారణంతోనే తెగించి మరీ తెలంగాణ కోసం పోరాడారు. ఇప్పుడు అలా పోరాడినోళ్లు సైతం ఆవేదన వ్యక్తం చేసే విచిత్రమైన పరిస్థితి తెలంగాణలో చోటు చేసుకుంది. ఇందుకు తాజాగా తెర మీదకు వచ్చిన ఉదంతాన్ని చెప్పాల్సిందే.
ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న వేళ.. పెద్ద ఎత్తున అద్దె బస్సుల్ని తీసుకురావాలన్నది తెలంగాణ సర్కారు ఆలోచనగా చెప్పాలి. దీనిపై ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గడిచిన పదమూడు రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ నేతల వేదన అంతా ఇంతా కాదు. వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఆర్టీసీ లాభాల బాట పడుతుందని.. ఏపీ ఆర్టీసీకి కష్టలు తప్పవని అనుకున్నామని.. కానీ.. అందుకు భిన్నంగా తెలంగాణకే నష్టం జరుగుతున్న వైనాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఏపీలో ప్రైవేటు బస్సులు ఎక్కువ. విభజన కారణంగా ఏపీ ఆర్టీసీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని అంచనా ఉండేదని.. కానీ.. ఆ అంచనా తప్పై.. ఏపీ కార్మికులు హ్యాపీగా ఉంటే.. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం రోడ్డు పాలైనట్లుగా వాపోతున్నారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా ఆర్టీసీని తెలంగాణ ప్రభుత్వమే నిర్వహించాలన్న తమ డిమాండ్ ను ప్రభుత్వం ఒప్పుకోకపోవటం తెలిసిందే. మరోవైపు.. ఏపీ ఆర్టీసీని ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించటంతో పాటు.. ప్రభుత్వంలో కలిపేయటం తెలిసిందే. ఏదో అనుకుంటే మరేదో జరగటం అంటే ఇదేనేమో?