Begin typing your search above and press return to search.

ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్... పొలిటికల్ స్టూడెంట్ గా ?

By:  Tupaki Desk   |   6 Jan 2022 5:30 PM GMT
ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్... పొలిటికల్ స్టూడెంట్ గా ?
X
కాలం మారుతుంది. మారని వాళ్ళను కూడా మార్చేస్తుంది. నిన్నటి కధ నేడు చెబితే రోత. రేపు జరగబోయేదాన్ని నేడే చేస్తే వింత. అన్ని రంగాల్లో ఇదే రూల్ అప్లై అవుతోంది. ఎవరైనా వెనకబడితే అవుట్ డేటెడ్ అనేస్తున్నారు. ఇక తెలుగు రాజకీయాల్లో చూసుకుంటే చంద్రబాబు పాతతరం పాలిటిక్స్ ఇప్పటికీ చేస్తూ బ్యాక్ బెంచ్ లోనే ఉండిపోతున్నారు. ఆయన నేర్చిన స్కూల్ పాఠాలు ఇపుడు పాస్ మార్కులను కూడా తీసుకురావడంలేదు.

దాంతో బాబు డీలా పడుతున్నారు. క్యాడర్ కూడా మా లీడర్ ఇంతేనని విసుక్కుంటోంది. నిజానికి తెలుగు రాజకీయం మారిపోయి చాలా కాలం అయింది. వైఎస్సార్ సీఎం అయ్యాక స్పీడ్ పెరిగింది. జగన్ జమానాలో అది పీక్స్ కి రీచ్ అయింది. నిన్నటి నీతులు చెబితే నేడు అంగీకరించేవారు లేరు. పంటికి పన్ను కంటికి కన్నూ అన్న రూల్ లేటెస్ట్ గా పాలిటిక్స్ లో అమలు చేస్తున్నారు. టీయారెస్ తెలంగాణాలో పవర్ లోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి నేతలను లాగేసుకుంటే అది వ్యూహం అన్నారు. దాన్నే చంద్రబాబు చేస్తే జంపింగ్ జఫాంగులను వెంటేసుకున్నాడు అన్నారు.

అంటే ఒకే ఆపరేషన్. అప్లై చేయడంలోనే తేడా ఉంది. ఇక తెలంగాణాలో ప్రత్యర్ధి పార్టీలను కంట్రోల్ చేస్తూ టీయారెస్ హైలెట్ అవుతోంది. ఏపీలో చూసుకున్నా వైసీపీ అలాగే దూకుడు చేస్తోంది. రెండున్నరేళ్ల జగన్ ఏలుబడిలో ఏపీకి ఏం చేసినా చేయకపోయినా టీడీపీని డీ మోరలైజ్ చేయడంలో మాత్రం కంప్లీట్ గా సక్సెస్ అయ్యారు. వారూ వీరూ లేదు, ఏకంగా అచ్చెన్నాయుడు లాంటి నేతలను అరెస్ట్ చేయించి వణుకు పుట్టించారు.

అంతేనా సాక్ష్తాత్తూ మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం మీద పట్టపగలే దాడి జరిగిపోయింది. ఇదేమి పని అని తమ్ముళ్ళు మొత్తుకున్నా నో యాక్షన్.. నో రియాక్షన్. ఇక మాటలతో ఎదురుదాడులు చేయడం, పర్సనల్ గా టార్గెట్ చేయడం ఇవన్నీ న్యూ ఎరా పాలిటిక్స్ గా చలామణీ అవుతున్నాయి. ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే అధికార పార్టీ వీరంగం ఒక లెవెల్ లో సాగింది. అయితే ట్రెడిషనల్ పాలిటిక్స్ ని నమ్ముకున్న టీడీపీ ఇవన్నీ చూస్తూ విస్తుపోవడం తప్ప మరేమీ చేయలేని పరిస్థితి.

జనాలు చూస్తున్నారు, వారే తీర్పు చెబుతారు అని చంద్రబాబు తృప్తి పడడమే మిగిలింది. కానీ పాలిటిక్స్ లో స్పీడ్ ని ఆయన ఇప్పటిదాకా అర్ధం చేసుకోలేకపోయారు. దాంతో వైసీపీ హై రేంజి స్పీడ్ తో ఏపీ పాలిటిక్స్ ని శాసించేదాకా కధ నడిచిపోయింది. మొత్తానికి ఇన్నాళ్ళకు చంద్రబాబుకు సీన్ అర్ధమైంది. జనాలు తీర్పు ఇవ్వడం కాదు, మనం మారాలి. ఢీ అంటే ఢీ కొట్టేలా ఉండాలని.

అదే ఇపుడు ఆయన క్యాడర్ కి నూరిపోస్తున్నారు. వచ్చే ఎన్నికలల్లో ఇలా దూకుడు చేస్తేనే గెలుపు దక్కుతుంది తప్ప మెత్తగా ఉంటే కుదరదు అని ఆయన వాస్తవం గ్రహించారు. జగన్ తాను సైలెంట్ గా ఉంటూనే వైసీపీలో జోరూ, జోష్ పెంచేశారు. తాను నోరు తెరచి మాట తూలకుండానే ప్రత్యర్ధి పార్టీలలో మంటలు పుట్టించారు. దీని మీద సగటు జనాలు ఏమనుకున్నా బేఖాతరు చేస్తూ వైసీపీ అధినాయకత్వం ముందుకు పోయింది. పొలిటికల్ గా సక్సెస్ అయింది.

ఇపుడు చంద్రబాబు కూడా ఎర్లీ సెవెంటీస్ నాటి ఓల్డ్ పాలిటిక్స్ కి స్వస్తి అనేస్తున్నారు. న్యూ ట్రెండి కి తగినట్లుగా కొత్తగా పాలిటిక్స్ ని ఆయన చదువుతున్నారు. ఒక విధంగా ఆయన ఇన్నేళ్ళకు మళ్ళీ పొలిటికల్ స్టూడెంట్ గా మారిపోయి అన్నీ అధ్యయనం చేస్తున్నారు. ఆయన సైతం ఢీ కొట్టే వారినే కోరుకుంటున్నారు. రాజకీయాల్లో వచ్చిన మార్పుని తెలుసుకుని మరీ కొత్త పాఠాలను తాను నేర్చుకుంటున్నారు. క్యాడర్ కి కూడా వాటినే విప్పిచెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవడానికి టీడీపీ గేర్ మారుస్తోంది. ప్లాన్ కూడా మారుస్తోంది. దేనికైనా ఢీ ఎవరైనా రెడీ అంటోంది. ఏపీలో ఈ పరిణామాలు హై ఓల్టేజ్ పాలిటిక్స్ కి కారణమవుతాయా.. వెయిట్ అండ్ సీ.