Begin typing your search above and press return to search.
యూపీలో మృత్యుహోష ఆగలేదు!
By: Tupaki Desk | 4 Sep 2017 7:55 AM GMTదేశంలోనే పెద్ద రాష్ట్రం - బీజేపీ పాలిత రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ లో పసికందుల మరణ ఘోష ఆగడం లేదు. ఆ రాష్ట్ర సీఎం యోగీ ఆదిత్యనాథ్ సొంత ప్రాంతం గోరఖ్ పూర్ లో ఆక్సిజన్ అందక 60మందికిపైగా శిశువులు - చిన్నారులు మృతి చెంది న ఘటన ఇంకా మరుపు రాకముందే ఇప్పుడు మరో ఘోరం జరిగిపోయింది. వైద్యుల నిర్లక్ష్యం - ఆస్పత్రుల నిర్వహణపై చూపుతున్న అశ్రద్ధ వెరసి చిన్నారుల ప్రాణాలు గాలిలో దీపంగా మారిపోయాయి. ఆగర్భ శోకంతో తల్లిదండ్రులు పెద్ద పెట్టున రోదిస్తున్నారు. తమ ఇంటి దీపాలు ఆరిపోయాయని గుండెలు బాదుకుంటున్నారు.
విషయంలోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని ఫర్రూఖాబాద్ లోని రామ్ మనోహర్ లోహియా ప్రభుత్వాసుపత్రిలో ఆస్పత్రిలో 49 మంది వైద్యం కోసం వచ్చిన చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని సమాచారం. వీరిలో అప్పుడే పుట్టిన 19 మంది శిశువులు ఉన్నట్టు తెలిసింది. పీడియాట్రిక్ విభాగంలో ఆక్సిజన్ సరఫరా లేమి, మందుల కొరత కారణంగా ఈ మరణాలు జరిగాయని - వైద్యుల తప్పిదం లేదని ఆస్పత్రి విభాగం వెల్లడించింది. అయితే, చిన్నారుల తల్లిదండ్రుల వాదన మాత్రం మరోలా ఉంది. వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారని, అందుకే తమ పిల్లలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.
ఆక్సిజన్ అందడం లేదని డ్యూటీ నర్సులకు తెలియజేశామని, అయితే, అప్పుడే ఎలా అయిపోయిందంటూ నిష్టూరంగా మాట్లాడారే తప్ప సౌకర్యాలపై దృష్టి పెట్టలేదని పలువురు ఆరోపించారు. ఇది పూర్తిగా ఆస్పత్రి నిర్లక్ష్యమేనన్నారు. సిబ్బంది, వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే తమ బిడ్డలు బతికే వారని అన్నారు. ఇక, ఈ విషయం తెలిసి రంగంలోకి ప్రవేశించిన పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి.. మృతి చెందిన చిన్నారుల తల్లదండ్రుల నుంచి సమాచారం సేకరించారు. ఎఫ్ ఐఆర్ లో మెడికల్ ప్రధానాధికారితోపాటు, పలువురి వైద్యుల పేర్లను నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు.