Begin typing your search above and press return to search.
కొత్త వ్యాపారంలోకి పతంజలి బాబా
By: Tupaki Desk | 13 July 2017 4:02 PM GMTమదపటేనుగులు లాంటి ప్లేయర్స్ ఉండే ఎఫ్ ఎంసీజీ మార్కెట్లోకి ఎంటరై.. విపరీతమైన పోటీకి తట్టుకొని మరీ మార్కెట్లో సంచలనంగా మారటం.. అమ్మకాల్లో సరికొత్త సంచలనాలు నమోదు చేయటం అంత తేలికైన విషయం కాదు. అసాధ్యమైన విజయాల్ని అలవోకగా తన ఖాతాలో వేసుకొని సత్తా యోగాగురు బాబా రాందేవ్ సొంతమని చెప్పక తప్పదు.
యోగాగురువు వ్యాపారం చేయటమా? అంటూ ఎటకారం చేసినోళ్లు నోరు మూత పడేలా షాకిచ్చిన బాబు ఇప్పుడున్న బిజినెస్ లు సరిపోనట్లు మరో కొత్త బిజినెస్ మొదలెట్టనున్నట్లుగా వెల్లడించారు. అయుర్వేద ఉత్పత్తులు మొదలుకొని సబ్బులు.. పేస్ట్ లు.. బిస్కెట్లు.. ఆటా.. న్యూడిల్ వరకూ ఎన్ని కుదిరితే అన్ని వస్తు ఉత్పత్తుల్లోకి దూసుకెళుతున్న ఆయన దూకుడుతో పతంజలి బ్రాండ్ మార్కెట్ పరిధి అంతకంతకూ పెరుగుతోంది.
తాజాగా ఆయన లాభదాయకమైన భద్రతా వ్యాపారాల్లోకి ప్రవేశించారు. పరాక్రమ్ సురక్ష ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో భద్రతా సంస్థను ఏర్పాటు చేయనున్నట్లుగా బాబా రాందేవ్ ప్రకటించారు. తమ సెక్యూరిటీ సంస్థ ద్వారా దేశంలో ఇరవై వేల నుంచి పాతిక వేల వరకూ ఉద్యోగాల్ని కల్పించనున్నట్లుగా ప్రకటించారు. త్వరలోనే తమ సంస్థ దేశంలోనే అతి పెద్ద భద్రతా కంపెనీగా అవతరిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
దేశంలోని ప్రతి ఒక్కరి వ్యక్తిగత రక్షణ కోసం.. దేశ భద్రతా విధుల కోసం సన్నద్ధం చేయటమే తమ లక్ష్యంగా చెప్పిన ఆయన.. రిక్రూట్ చేసుకున్న యువతకు శిక్షణ ఇవ్వటానికి పదవీ విరమణ చేసిన ఆర్మీ.. పోలీసు అధికారుల నేతృత్వంలో శిక్షణా కార్యక్రమాన్ని చేపడతామన్నారు