Begin typing your search above and press return to search.

స్వ‌లింగ సంప‌ర్కం త‌ర్వాత‌.. టార్గెట్ ఏమిటంటే?

By:  Tupaki Desk   |   9 Sep 2018 4:45 AM GMT
స్వ‌లింగ సంప‌ర్కం త‌ర్వాత‌.. టార్గెట్ ఏమిటంటే?
X
స్వ‌లింగ సంప‌ర్కం మీద సుప్రీంకోర్టు వెల్ల‌డించిన చారిత్ర‌క తీర్పు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించ‌ట‌మే కాదు.. ఏళ్ల‌కు ఏళ్లుగా స్వ‌లింగ సంప‌ర్కం నేరం కాదంటూ పోరాడుతున్న వారి ఆనందం అంతా ఇంతా కాదు. స్వ‌లింగ సంప‌ర్కాన్ని నేరం కాద‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం తీర్పు నేప‌థ్యంలో.. త‌మ తాజా టార్గెట్ అలాంటి వారి పెళ్లిళ్ల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త సాధించ‌ట‌మేన‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

స్వ‌లింగ సంప‌ర్కం మీద సుప్రీం తీర్పు నేప‌థ్యంలో.. కేంద్ర స‌ర్కారు ఈ విష‌యాన్ని ఇంత‌టితో పుల్ స్టాప్ పెట్టాల‌ని.. స్వ‌లింగ వివాహాల వ‌ర‌కూ వెళ్ల‌కూడ‌ద‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. స్వ‌లింగ సంప‌ర్కులు పెళ్లి చేసుకునే హ‌క్కు.. ఆస్తి హ‌క్కు కూడా ఇందులో భాగ‌మ‌ని.. ఈ అంశాల మీద కూడా పోరాటం షురూ చేయ‌నున్నారు.

స్వ‌లింగ సంప‌ర్కం నేరం కాదంటూ సుప్రీం తీర్పు ఇవ్వ‌టానికి కార‌ణ‌మైన సునీల్ మెహ్రా ఇప్పుడు.. స్వ‌లింగ సంప‌ర్కులు పెళ్లి చేసుకోవ‌టానికి వీలుగా చ‌ట్టాలు తెచ్చేందుకు పోరాటం చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. స్వ‌లింగ వివాహాల‌ను తాము వ్య‌తిరేకిస్తామ‌ని కేంద్రం చెప్పిన నేప‌థ్యంలో.. వాటికి వ్య‌తిరేకంగా తాము పోరాటం చేస్తామ‌ని చెబుతున్నారు.

స్వ‌లింగ పెళ్లిళ్లను తాము వ్య‌తిరేకించ‌నున్న‌ట్లు ఆర్ ఎస్ ఎస్ నేత‌లు చెబుతున్నారు. ఇలాంటి సంబందాల‌ను భార‌తీయ స‌మాజం ఆమోదించ‌ద‌ని.. సంఘ్ ప‌రివార్ అధికార ప్ర‌తినిధి అరుణ్ కుమార్ చెబుతున్నారు. కొంద‌రు స్వ‌లింగ సంప‌ర్కులు త‌మ వివాహాల‌ను అలాంటి వాటికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉన్న దేశాల‌కు వెళ్లి జంటలుగా మారుతున్న‌ట్లు చెప్పారు. దేశంలో ఇలాంటి పెళ్లిళ్ల‌ను తాము ఒప్పుకునేది లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేస్తున్నారు.