Begin typing your search above and press return to search.
కేసీఆర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో చెప్పిన మంత్రి
By: Tupaki Desk | 27 Dec 2019 10:27 AM GMTతెలంగాణ అధికారపక్షమైన టీఆర్ఎస్ కు సంబంధించి కొన్ని విషయాల మీద ఓపెన్ గా మాట్లాడేందుకు ఎవరూ ఇష్టపడరు. నిజం తెలిసినప్పటికి మౌనంగా చూస్తుండి పోతారే తప్పించి.. తొందరపడి ఒక మాట బయట కు చెప్పేయటం ఉండదు. అందుకు భిన్నంగా మంత్రి ఒకరు చెప్పిన మాటలు వింటే అవాక్కు కావటమే కాదు.. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందా? అన్న సందేహం కలుగక మానదు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉన్న కేసీఆర్ తర్వాత ఆ కుర్చీలో కూర్చునేదెవరు? కేసీఆర్ రాజకీయ వారసుడు ఎవరు? అన్న విషయంలో ఇప్పటికైతే ఎలాంటి సందేహాలు లేవు. అయినప్పటికీ ఎవరూ దీని గురించి తొందరపడి మాట్లాడటం కనిపించదు. తాజాగా ఇదే అంశాన్ని టచ్ చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ఉద్యమం కారణంగా ఉద్యోగ సంఘాల నాయకుడు కాస్తా ప్రజాప్రతినిధిగా మారిన ఆయన.. మంత్రి అయ్యారు. తాజాగా మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి కావటానికి కేటీఆర్ కు అన్ని అర్హతులు ఉన్నాయన్నారు.
ఉద్యమంలోనూ కేటీఆర్ క్రియా శీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన రానున్నరోజుల్లో సీఎం కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది కేటీఆరే అంటూ చెప్పిన శ్రీనివాస గౌడ్ మాటలు రాజకీయం గా ఇప్పుడు అందరి చూపు పడేలా చేశాయని చెప్పక తప్పదు.