Begin typing your search above and press return to search.
ఇవాల్టి నుంచి మద్యం అమ్మకాలు!
By: Tupaki Desk | 13 April 2020 3:00 AM GMTరోజు పీకలదాకా తాగే అవకాశం ఉండి.. ఉన్నట్లుండి మద్యం అమ్మకాల్ని ఆపేస్తున్నామన్న ప్రభుత్వ నిర్ణయంలోని తీవ్రత చాలామందికి అర్థం కాదు. కానీ.. రోజూ మద్యం సేవించే వారికి మాత్రం నరకం అంటే ఏమిటో ఇప్పుడు చూస్తున్నారు. చాలామందికి మందు చుక్క నాలుక మీద పడక పిచ్చెక్కినట్లుగా వ్యవహరిస్తున్నారు. కరోనా మహమ్మారి విరుచుకుపడిన వేళ.. మద్యం అమ్మకాల్ని నియంత్రించక పోతే దారుణమైన ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. దీంతో.. మద్యం అమ్మకాల్ని నిలిపి వేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.
దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో మద్యం అమ్మకాల్ని ఇటీవల షురూ చేశారు. ఆ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాల్ని మిగిలిన రాష్ట్రాల్లో అమలు చేయాలని కోరినా.. ప్రభుత్వాలు నో చెబుతున్నాయి. దీంతో మందు బాబులు.. ప్రభుత్వం తమ బాధను అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా రెండు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల్ని ఇవాల్టి నుంచి షురూ చేయాలని నిర్ణయించారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ మద్యం దుకాణాలు తెరవాలని ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంతకీ ఆ రెండు రాష్ట్రాలు ఈశాన్య భారతావనికి చెందినవే కావటం గమనార్హం. అసోం.. మేఘాలయ రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి మద్యాన్ని విక్రయించనున్నారు. అయితే.. ఈ అమ్మకాలకు కొన్ని పరిమితుల్ని విధించారు. మద్యం కొనుగోలుకు వచ్చే వారు భౌతిక దూరాన్ని తప్పని సరిగా పాటించాలి. మద్యం బాటిల్ తీసుకునే వేళ.. డబ్బులు ఇచ్చే వేళలోనూ శానిటైజేషన్ తప్పకుండా పాటించాలి. దగ్గు.. జలుబు.. జ్వరం లాంటి సమస్యలు ఉన్న వారికి మద్యం అమ్మకాల బాధ్యతను అప్పజెప్పకూడదు. ఇవన్నీ చూసిన తర్వాత.. పరిమితవేళల్లో మద్యం అమ్మకాల్ని షురూ చేస్తే.. అక్రమంగా అమ్ముతున్న మద్యానికి చెక్ పడుతుందని చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా నిర్ణయాన్ని ఎప్పటికి తీసుకుంటారో?