Begin typing your search above and press return to search.
గుజరాత్ రచ్చకు అనుకున్న ముగింపే పడింది
By: Tupaki Desk | 31 Dec 2017 9:58 AM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ లో నెలకొన్న రచ్చకు శుభం కార్డు పడింది. ఊహించిన రీతిలోనే...ఈ పంచాయతీ సానుకూల రీతిలోనే బ్రేక్ అయింది. శాఖల కేటాయింపులపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక - పట్టణాభివృద్ధి - పెట్రోలియం శాఖలను నితిన్ పటేల్ నిర్వహించారు. కాగా ప్రస్తుతం ఆర్థిక శాఖను సౌరభ్ పటేల్ కు కేటాయించారు. మిగతా రెండు శాఖలను సీఎం రూపానీ తన వద్దే ఉంచుకున్నారు. ఇక నితిన్ పటేల్ కు రోడ్లు - భవనాలు - వైద్యారోగ్య శాఖలను కేటాయించడంతో.. నితిన్ పటేల్ అలక వహించినట్లు వార్తలు షికారు చేసిన విషయం విదితమే. గతంలో నిర్వహించిన మూడు శాఖలను మూడు రోజుల్లో తనకు తిరిగి ఇవ్వకపోతే రాజీనామా చేసేందుకు నితిన్ పటేల్ సిద్ధపడినట్లు నిన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
మరో సీనియర్ నేత - మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్ కు ఫోన్ చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. గతంలో తాను నిర్వహించిన శాఖలను తనకు కేటాయించకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆనందీబెన్ తో నితిన్ చెప్పినట్టు అనధికారవర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ విషయాన్ని బీజేపీ నేతలు ఎవరూ ధ్రువీకరించడం లేదు. మెహసానాకు చెందిన పలువురు పాటిదార్ నేతలు శనివారం నితిన్ నివాసానికి వెళ్లి తమ మద్దతు తెలిపారు. అనంతరం కిరీట్ పటేల్ అనే పాటిదార్ నాయకుడు మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వంలో అత్యంత సీనియర్ అయిన నితిన్ పటేల్ కు అన్యాయం జరిగిందని, తామంతా ఆయనతోనే ఉన్నామని చెప్పారు. నిజానికి 2016లో ఆనందీబెన్ పటేల్ అనంతరం నితిన్ ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు. ఆయన కుటుంబం మిఠాయిలు పంచిపెడుతూ సంబురాలు కూడా చేసుకుంది. కానీ చివరి నిమిషంలో విజయ్ రూపానీని సీఎం గద్దెపై కూర్చోబెట్టిన బీజేపీ - నితిన్ పటేల్ ను ఆయనకు డిప్యూటీని చేసింది. నితిన్ పటేల్ ఇప్పటికీ ప్రభుత్వంలో నంబర్-టూయేనని, శాఖలు మారినంత మాత్రాన ఆయనకున్న ప్రాధాన్యం మారదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఈ పరిణామం బీజేపీ అగ్రనేతలైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దృష్టికి చేరింది. స్వరాష్ట్రంలోనే లుకలుకలను సెట్ చేసుకోలేని బీజేపీ అంటూ ప్రచారం సాగుతున్న తీరుపై ఇద్దరు నేతలు సమీక్షించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వారు ఎంట్రీ ఇచ్చారు. సీఎం విజయ్ రూపానీ - డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ కు మధ్య ఉన్న విభేదాలకు తెర పడింది. ప్రస్తుతం తనకు కేటాయించిన రోడ్లు - భవనాలు - వైద్యారోగ్య శాఖల మంత్రిగా ఆదివారం బాధ్యతలు స్వీకరిస్తానని నితిన్ పటేల్ స్పష్టం చేశారు. తనకు తగిన శాఖలు కేటాయిస్తానని తనకు హామీ ఇచ్చారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ విషయంపై అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడినట్లు నితిన్ పటేల్ చెప్పారు.
డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ అలక వీడటంతో గుజరాత్ లోని బీజేపీ శ్రేణులు రిలాక్స్ అయ్యాయి. అయితే ఇంతకముందు పెద్ద హైడ్రామా నడిచింది. శాఖల కేటాయింపుపై అసంతృప్తితో ఉన్న గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ బీజేపీని వదిలి పదిమంది ఎమ్మెల్యేలతో కలిసి వచ్చి కాంగ్రెస్ లో చేరాలని పాటిదార్ రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ సూచించారు. కాంగ్రెస్ లో తగిన స్థానాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. నితిన్ పటేల్ నుండి కీలకమైన శాఖలను తొలిగించడంతో పాటిదార్ నేతలు ఆయనకు అండగా నిలిచారు. ఎంతో సీనియర్ నాయకుడు - గత 27 ఏళ్లుగా పార్టీ కోసం శ్రమిస్తున్న నితిన్ పటేల్ కు బీజేపీ సముచిత స్థానం కల్పించడం లేదని, ఆయనను పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని హార్దిక్ పటేల్ ఆరోపించారు. నితిన్ భాయ్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ నుండి బయటకు రావాలి. తనకు మద్దతునివ్వమని, తగిన పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ ను కోరాలి అని సూచించారు. నితిన్ భాయ్ రాజీనామా చేసేందుకు సిద్ధపడితే, ఆయన వెంట నడిచేందుకు మరో పది మంది బీజేపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పారు. అహంకారులైన బీజేపీ నేతలకు వ్యతిరేకంగా, రాష్ట్రంలో సుపరిపాలన కోసం కలిసి పోరాడుదామని హార్దిక్ పటేల్ నితిన్ పటేల్ కు పిలుపునిచ్చారు.