Begin typing your search above and press return to search.
300 మందికి అంత్యక్రియల్లో సేవలు అందించి ... కరోనాకే బలయ్యాడు
By: Tupaki Desk | 20 May 2021 1:30 AM GMTకరోనా వైరస్ మహమ్మారి బారినపడి ఎంతోమంది అర్ధాంతరంగా ప్రాణాలు విడిచి, పరలోకానికి పయనమవుతున్నారు. మయదారి మహమ్మారి ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. తాజాగా కరోనాతో కన్నుమూసిన కొన్ని వందలమందికి అంత్యక్రియలు జరిపిన ఓ వ్యక్తి అదే కోవిడ్ సోకి ప్రాణాలు విడిచాడు. కరోనా మహమ్మారితో చనిపోయిన వారి దహన సంస్కారాలకు బంధుమిత్రులే దూరంగా ఉంటున్న రోజుల్లో హిసార్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఏకంగా 300 మందికి పైగా కరోనా వైరస్ బాధితుల అంత్యక్రియలకు సేవలందించాడు. కరోనా తో ప్రాణాలు విడిచిన వారికి అంత్యక్రియలు సజావుగా సాగేలా ఏర్పాట్లు చేశాడు.
ఎందరో కొవిడ్ బాధితులకు అండగా నిలిచిన ప్రవీణ్ కుమార్ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన రెండు రోజులకే సోమవారం రాత్రి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశాడు. హిసార్ లోని రిషినగర్ స్మశాన వాటికలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా మంగళవారం కుమార్ అంత్యక్రియలు జరిగాయి. కరోనా రోగుల అంత్యక్రియల కోసం హిసార్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విభాగానికి సారధిగా కుమార్ గత ఏడాది కాలంగా 300 మందికి పైగా కొవిడ్ బాధితులకు అంత్యక్రియలను దగ్గరుండి జరిపించాడు. ఎంతో మందికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రవీణ్ ఇలా మరణించడం స్థానికులను కలిచివేస్తోంది. ప్రవీణ్ అంత్యక్రియలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హిసర్ మేయర్ ఆధ్వర్యంలో రిషినగర్‌లో మంగళవారం జరిపారు. ప్రవీణ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇతనిది ఉమ్మడి కుటుంబం. దాదాపు అందరూ మున్సిపల్ కార్పొరేషన్‌లోనే ఉద్యోగం చేస్తున్నారు.