Begin typing your search above and press return to search.

ఆఫ్టర్ స్మాల్ గ్యాప్ .. పట్టాభి ఈజ్ బ్యాక్

By:  Tupaki Desk   |   8 Nov 2021 5:55 AM GMT
ఆఫ్టర్ స్మాల్ గ్యాప్ ..  పట్టాభి ఈజ్ బ్యాక్
X
బోస్‌డీకే ..గత కొన్ని రోజులుగా ఈ పదం ఆంధ్రప్రదేశ్ లో ఎంతటి ప్రాచుర్యం పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. తెలుగుదేశం పార్టీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని మీడియా సమావేశంలో బోస్ డీకే అని సంబోధించడం తో పట్టాభి , టీడీపీ పై వైసీపీ నేతలు విరుచుపడ్డారు. ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.ముఖ్యమంత్రి పై దూష‌ణ‌కు దిగిన ప‌ట్టాభి పై కేసు పెట్టడం , నాటకీయంగా అరెస్ట్ చేయడం, అనంత‌రం సెంట్రల్ జైలుకి తీసుకెళ్లడంతో పట్టాభి బాగా హైలెట్ అయ్యాడు. అప్పటివరకు పార్టీలో ఓ నేత ఉన్న పట్టాభి కీలక నేతగా ఎదిగాడు. ఈ బోస్ డీకే వివాదం టీడీపీ కి ఎంతటి మేలు చేసిందో లేదో పక్కన పెడితే పట్టాభి కి మాత్రం మంచి ఇమేజ్ ను తెచ్చి పెట్టింది.

అయితే గంటల వ్యవధిలోనే రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు నుంచి విడుద‌ల‌య్యారు. గ‌త నెల 23న జైలు నుంచి విడుద‌లైన ప‌ట్టాభి విజ‌య‌వాడ‌లోని త‌న ఇంటికి కూడా రాకుండా, అటు నుంచే అటే మాల్దీవుల‌కు కుటుంబ స‌భ్యుల‌తో స‌హా వెళ్లిపోయారు. అప్ప‌టి నుంచి నిన్న‌టి వ‌ర‌కూ పట్టాభి ఆచూకీ లేదు. రెండు వారాల త‌ర్వాత ఆయ‌న తాజాగా మరోసారి మీడియా ముందుకొచ్చారు. సీఎంపై ప్ర‌యోగించిన బోస్‌ డీకే అనే ప‌దానికి బాగున్నారా అని టీడీపీ స‌రికొత్త‌ అర్థం చెప్పింది. ముఖ్య‌మంత్రిని అంత మ‌ర్యాద‌గా పిలిచిన ప‌ట్టాభి, ఎందుక‌ని క‌నిపించ‌కుండా పోయార‌నే ప్ర‌శ్న త‌లెత్తింది. అలాగే చంద్రబాబు నాయుడు .. ఢిల్లీ కి వెళ్లిన సమయంలో అమిత్ షా ను బోస్ డీకే అమిత్ షా , మోడీ ని బోస్ డీకే ప్రధాని మోడీ అని వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. పోటా పోటీగా రాష్ట్రపతిని కూడా కలిశారు ఇరు పార్టీల నేతలు.

నోరు మంచిదైతే ఊరు మంచిద‌వుతుంద‌ని, ప‌ట్టాభి నోటికొచ్చిన‌ట్టు మాట్లాడి, ఆ వ్యవహారం బెడిసి కొట్టడం తో భ‌యంతో దాక్కోవ‌డం ఎందుక‌ని టీడీపీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. నిజానికి ప‌ట్టాభి అంటే టీడీపీలో ఎవ‌రికీ గిట్ట‌దని స‌మాచారం. కేవ‌లం చంద్ర‌బాబు నాయుడు, లోకేశ్ అండ చూసుకుని, పార్టీలోని మిగిలిన నాయకులంటే గౌర‌వం లేకుండా వ్య‌వ‌హ‌రిస్తార‌నే ఆగ్ర‌హం టీడీపీలో బ‌లంగా ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు, అలాగే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌, విద్యుత్ కొనుగోళ్లు, రాష్ట్రం విచ్చల‌విడిగా అప్పుల చేయ‌డంపై ప‌య్యావుల కేశ‌వ్‌, ఇత‌ర నాయ‌కులు మాట్లాడుతున్నారు. ఈ సమయంలో అందుబాటులో ప‌ట్టాభి వుంటే ఇత‌రుల‌కు అవ‌కాశం ఇచ్చే వారు కాద‌ని పార్టీ నాయ‌కుల మ‌ధ్య ఓ చర్చ జరుగుతోందట.

బోస్ డీకే అని సీఎం ను తిట్టి .. బెయిల్ పై జైలు నుండి రాగానే దాక్కోవ‌డం ఆ పార్టీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తాజాగా మీడియా ముందుకొచ్చిన ఆయ‌న త‌న మాట‌లు వైసీపీ వాళ్లు జీర్ణం చేసుకోలేక‌పోతే ఏం చేయ‌లేన‌ని, అన్నీ ఆధారాల‌తోనే మాట్లాడ్తాన‌ని చెప్పుకొచ్చారు. ఆధారాల‌తో మాట్లాడితే ఇన్ని స‌మ‌స్యలు వచ్చేవి కావు. ఏదైనా మాట్లాడే సమయంలో కొంచెం వెనుకా ముందు అలోచించి , ఏది మంచిది ఏది చెడ్డది అని ఒక క్షణం అలోచించి మాట్లాడితే ఇలా మాల్దీవులు అంటూ విపత్కర పరిస్థితుల్లో విహారయాత్రలకు పోవాల్సిన అవసరం ఉండేది కాదని చెప్తున్నారు.