Begin typing your search above and press return to search.
ఆరుగురు అగ్రనేతలకు షాక్ తగిలింది
By: Tupaki Desk | 18 July 2016 3:49 PM GMTకేంద్ర సమాచార కమిషన్ జాతీయ పార్టీలకు చెందిన ఆరుగురు అగ్రనేతలకు షాక్ ఇచ్చింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద పలువురు కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్లు - ప్రశ్నలకు సమాధానమివ్వడంలో విఫలమైనందుకు సీఐసీ నోటీసులు జారీ చేసింది. కేంద్ర హోంమత్రి రాజ్ నాథ్ సింగ్ - కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ - బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి - సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ - ఎన్సీపీ అధినేత శరద్ పవార్ - సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డికి సీఐసీ నోటీసులు జారీ చేసింది.ఈ పిటిషన్ల విచారణకు ఈ నెల 22న హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.
బీజేపీ - కాంగ్రెస్ - బీఎస్పీ - ఎన్సీపీ - సీపీఎం - సీపీఐ అధ్యక్షుల విషయంలో సీఐసీ రిజిస్ట్రార్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఆర్కే జైన్ అనే ఫిర్యాదుదారుడు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. 2014 - 2015 సంవత్సర కాలాల్లో పార్టీల నిధులు - విరాళాలు తదితర అంశాలకు సంబంధించిన వివరాలను అందజేయాలని ఆరు జాతీయ పార్టీలను ఆర్కే జైన్ పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను సమాచార కమిషనర్లు బీమ ల్ జుల్క - శ్రీధరాచార్యులు - సుధీర్ భార్గవతో కూడిన సీఐసీ విచారిస్తున్నది. ఈ క్రమంలోనే తాజాగా సీఐసీ ఈ సమాచారం కోసం నోటీసులు అందించింది.