Begin typing your search above and press return to search.

సుధాకర్ కేసు మరవకముందే మరో డాక్టర్ హైకోర్టుకు..

By:  Tupaki Desk   |   8 Jun 2020 5:00 AM GMT
సుధాకర్ కేసు మరవకముందే మరో డాక్టర్ హైకోర్టుకు..
X
ఏపీలో కొలువుదీరిన జగన్ ప్రభుత్వాన్ని ప్రశాంతంగా సాగనివ్వడం లేదు. కరోనా-లాక్ డౌన్ వేళ ఇబ్బందులను ఒర్చుకోకుండా విమర్శించి డాక్టర్ సుధాకర్ సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత ఎంత కథ జరిగిందో మనం చూశాం.. ఇప్పుడు అలాంటిదే సేమ్ మరో ఘటన చోటుచేసుకుంది.

విశాఖకు చెందిన డాక్టర్ సుధాకర్ ఘటన మరిచి పోకముందే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నియోజకవర్గం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో మరో డాక్టర్ రెచ్చిపోయారు. అవినీతిని ప్రశ్నించిన ఓ మహిళా డాక్టర్ పై వేధింపులకు పాల్పడ్డారు.

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని పెనుమూరు ప్రభుత్వం ఆసుపత్రిలో డిసెంబర్ లో అనితారాణి అనే డాక్టర్ విధుల్లో చేరారు. అమెరికాలో కోట్లు సంపాదించే జాబ్ వదిలేసి మరీ ఆమె పేదలకు సేవ చేయాలని డాక్టర్ గా చేరారు.

రెండు నెలల క్రితం కింది స్థాయి ఉద్యోగుల అవినీతిని ఆమె ప్రశ్నించారు.దీంతో కొందరు నేతలు, పోలీసులు ఆమెను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. వేధింపులకు పాల్పడ్డారని టీడీపీ నేతలకు ఆమె ఫిర్యాదు చేసి ఆరోపించింది.

రెండు నెలల క్రితం కిందిస్థాయి ఉద్యోగుల అవినీతిపై డాక్టర్ అనితారాణి ప్రశ్నించారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొందరు నేతలు ఆమె బంధించి అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆమె టీడీపీ నేతలకు విన్నవించి వాపోయారు. పోలీసులూ పట్టించుకోలేదని.. ఉన్నతాధికారులతో ఫోన్లు చేయించి ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించింది.

చిత్తూరు జిల్లా నేతలు, పోలీసుల తీరుతో తనకు న్యాయం జరిగే అవకాశం లేదని భావించిన డాక్టర్ అనితారాణి వారం రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించింది. డాక్టర్ సుధాకర్ లాగా తనకు న్యాయం చేయాలని ఆమె హైకోర్టును కోరారు. ఇప్పటికే సుధాకర్ కేసులో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ నేతల ప్రోద్బలంతో హైకోర్టు మెట్లు ఎక్కిన డాక్టర్ అనితారాణి విషయంలో ఎలా ముందుకెళ్తుందో చూడాలి