Begin typing your search above and press return to search.
ప్రకాశ్ రాజ్ కు మద్దతు ప్రకటించిన మరో పార్టీ
By: Tupaki Desk | 5 Jan 2019 4:59 AM GMTవచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కు మద్దతు పెరుగుతోంది. టీఆర్ ఎస్ ఇప్పటికే ఆయనకు మద్దతు ప్రకటించగా.. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తోడైంది. ప్రకాశ్ రాజ్ కు తాము సపోర్ట్ చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించింది.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని ప్రకాశ్ రాజ్ గత మంగళవారం వెల్లడించారు. ఏ స్థానం నుంచి బరిలో దిగతామన్నది త్వరలోనే చెప్తానన్నారు. అనంతరం టీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను ప్రకాశ్ రాజ్ కలిశారు. ఆయనకు కేటీఆర్ మద్దతు ప్రకటించారు. దీంతో తెలంగాణ నుంచి ఆయన పోటీ చేస్తారనేమోనని వార్తలు వెలువడ్డా అవన్నీ ఊహాజనితమేనని దాదాపుగా తేలిపోయింది. ప్రకాశ్ రాజ్ కర్ణాటక నుంచి పోటీ చేయడం ఖాయమైంది.
తాజాగా కర్ణాటక ఆప్ కన్వీనర్ పృథ్వీ రెడ్డి బెంగళూరులో ఓ సభ ఏర్పాటుచేశారు. అందులో ఆప్ కీలక నేత మనీశ్ సిసోడియాతోపాటు ప్రకాశ్ రాజ్ - ఆప్ కార్యకర్తలు పాల్గొన్నారు. సిసోడియా మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీపై ప్రకాశ్ రాజ్ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల్లోకి మంచి వ్యక్తుల రాక అత్యావశ్యకమని పేర్కొన్నారు. ఆప్ ప్రకాశ్ రాజ్ కు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఆమ్ మద్దతుపై ప్రకాశ్ రాజ్ ధన్యవాదాలు తెలియజేశారు. బెంగళూరులో తాజా సమావేశం జరగడంతో అక్కడి నుంచే ప్రకాశ్ రాజ్ ఎన్నికల బరిలో దిగుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.