Begin typing your search above and press return to search.
సినిమాను చూసి సీరియల్ కిల్లర్ గా మారాడు..ఐదురుగురును చంపేశాడు
By: Tupaki Desk | 3 Sep 2022 4:37 AM GMTసినిమాలు ప్రజల మీద ప్రభావాన్ని చూపుతాయా? లేదా? అనే దాని మీద చర్చ ఇప్పటిది కాదు. సినీ రంగానికి చెందిన పలువురు.. సినిమా వల్ల చెడు త్వరగా వ్యాపిస్తుందని.. దాని ప్రభావం చాలా ఉంటుందని చెప్పినా ససేమిరా అంటారు. అందుకు వారో సిత్రమైన లాజిక్ ను చూపిస్తుంటారు.
ఒకవేళ చెడును ప్రోత్సహించేలా సినిమాలుప్రభావితం చేస్తుంటే.. మంచి కూడా అంతేలా వ్యాపించాలి కదా? అలా ఎందుకు జరగటం లేదని వాదిస్తుంటారు. అయితే.. ఇలాంటి పిడి వాదన వినిపించే వారికి చెప్పేదొక్కటే. చెడును వ్యాపించినంత త్వరగా మంచి వ్యాపించదన్నది మర్చిపోకూడదు.
తాజాగా ఒక యువకుడు ఇటీవల విడుదలైన ఒక యాక్షన్ మూవీకి ప్రభావితమై.. వరుస పెట్టి హత్యలు చేయటం షురూ చేశాడు. మధ్యప్రదేశ్ లోని సాగర్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల కుర్రాడు సినిమాల్ని విపరీతంగా చూసేశాడు. ఇతని పేరు శివప్రసాద్. తాజాగా విడుదలైన ఒక యాక్షన్ మూవీకి తీవ్రంగా ప్రభావితమైన అతను.. నిద్రపోతున్న సెక్యురిటీ గార్డులే లక్ష్యంగా చేసుకొని వరుస పెట్టి హత్యలు చేయటం మొదలుపెట్టాడు.
స్వల్ప వ్యవధిలో ఐదుగురు సెక్యూరిటీ గార్డుల ప్రాణాలు తీసిన అతను..ఆగస్టు 28 నుంచి మూడు రాత్రులు ముగ్గురిని చంపేసిన వైనం షాకింగ్ గా మారింది. నిద్రపోతున్న సెక్యురిటీ గార్డుల్ని చంపేయటం.. వారి దగ్గర ఉన్న నగదును తీసుకొని పారిపోయేవాడు. ఈ వరుస హత్యలు సంచలనంగా మారటంతో.. పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు.
తాజాగా భోపాల్ లో ఒక మార్బుల్ షాపు వద్ద కాపలాగా ఉన్న 23 ఏళ్ల సానో వర్మ మీద రాయితీ దాడి చేసిన అతను హత్య చేశాడు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ లో అతడ్ని గుర్తించారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వరుస హత్యలకు కారణం.. తాను చూసిన యాక్షన్ మూవీ అని చెప్పిన వైనంతో పోలీసులు సైతం షాక్ తిన్న పరిస్థితి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.