Begin typing your search above and press return to search.

వీడియో చూస్తే.. వెన్నులో వణుకు గ్యారెంటీ.. కుంభమేళకు అంతలా పోటెత్తటమా?

By:  Tupaki Desk   |   13 April 2021 8:30 AM GMT
వీడియో చూస్తే.. వెన్నులో వణుకు గ్యారెంటీ.. కుంభమేళకు అంతలా పోటెత్తటమా?
X
కంటికి కనిపించని మహమ్మారి ప్రపంచాన్ని వణికించేసి.. ఇప్పటికే రెండు.. మూడు రౌండ్లు చాలా దేశాల్ని చుట్టేసింది. ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ నడుస్తోంది. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న వేళ.. గతంలో మాదిరి లాక్ డౌన్ విధించలేని పరిస్థితి దేశానిది. గత ఏడాది విధించిన లాక్ డౌన్ నుంచే దేశం.. దేశ ప్రజలు కోలుకోలేని వేళ.. మళ్లీ లాక్ డౌన్ విధించే చాన్సు లేదు. అలాంటప్పుడు ఎవరికి వారు జాగ్రత్తగా ఉండటానికి మించింది మరొకటి లేదు. అయితే.. ఇలాంటేవేమీ దేశంలోని చాలామందికి పట్టటం లేదన్న విషయం ఈ వీడియోను చూస్తే అర్థమవుతుంది.

పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళాను మిస్ కాకుడదన్న ఉద్దేశంలో లక్షలాది మంది భక్తులు పోటెత్తుతున్న వైనం చూస్తే.. మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఇప్పటికే రోజుకు లక్షన్నర కేసులు దేశంలో నమోదై.. వడివడిగా 2 లక్షల కేసుల దిశగా పరుగులు తీస్తున్న వేళ.. కుంభమేళ జాతరను చూసినప్పుడు.. దానికి హాజరవుతున్న జన సందోహాన్ని చూస్తున్నప్పుడు.. ఇప్పుడు నమోదవుతున్న కేసుల సంఖ్య చాలా తక్కువగా చెప్పక తప్పదు.

పుణ్యస్నానాల పేరుతో కరోనాను పట్టించుకోకుండా లక్షలాది భక్తులు ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ కు చేరుకొంటున్నారు. గంగానదిలో స్నానాలు చేస్తున్న భక్తకోటిని చూస్తే నోట మాట రాదు. కోవిడ్ నిబంధనల్ని కఠినంగా పాటిస్తున్నట్లుగా అక్కడి ప్రభుత్వం చెబుతున్నప్పటికి.. అలాంటివేమీ పట్టించుకోకుండా ప్రజలు భక్తి.. నమ్మకం పేరుతో వ్యవహరిస్తున్న తీరు అధికారుల్ని వణికిస్తోంది.

తాము ఎంత చెప్పినా ప్రజలు వినటం లేదని.. తామేం చేయాలో అర్థం కావట్లేదని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. హరిద్వార్ కు వచ్చే భక్తులకు తాము కరోనా పరీక్షలు చేస్తున్నట్లు చెబుతున్నా.. అదెంతవరకు అన్నది సందేహమే. మరోవైపు.. పరీక్షలు చేస్తున్న వారిలోపలువురికి పాజిటివ్ గా తేలుతున్నాయి. షాహీ స్నాన్ కు పాల్గొనేందుకు వచ్చిన 372 మంది భక్తులకు పాజిటివ్ గా తేలినట్లు చెబుతున్నారు. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళాలో పాల్గొనటానికి వస్తున్న భక్తులకు కరోనా ఒక అడ్డంకిగా ఫీల్ కాకపోవటం గమనార్హం.