Begin typing your search above and press return to search.

యోగి ఫోన్ చేశాకే అంత్య‌క్రియ‌లు చేశారు

By:  Tupaki Desk   |   3 May 2017 8:13 AM GMT
యోగి ఫోన్ చేశాకే అంత్య‌క్రియ‌లు చేశారు
X
దాయాది పాకిస్థాన్ సైనికులు అత్యంత పైశాచికంగా మ‌న జ‌వాన్ల‌ను చంప‌టం తెలిసిందే. పాక్ సైనికుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వీర జ‌వాన్ల వైనంపై దేశ ప్ర‌జ‌లంతా తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యేలా చేసింది. అత్యంత దారుణంగా హ‌త‌మార్చిన వైనంపై ప్ర‌జ‌లంతా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. కాల్పుల విర‌మ‌ణ అనంత‌రం దుర్మార్గంగా కాల్ప‌లు జ‌ర‌ప‌ట‌మే కాదు.. త‌ల‌లు వేరు చేసి.. శ‌రీర భాగాల్ని ముక్క‌లు ముక్క‌లుగా న‌రికిన వైనంపై తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ఉదంతంలో ప్రాణాలు కోల్పోయిన ఇద్ద‌రు వీర జ‌వాన్ల‌లో ప్రేమ్ సాగ‌ర్ ఒక‌రు. అయితే.. ఆయ‌న‌కు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు ఆయ‌న కుటుంబం నిరాక‌రించింది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి అదిత్య‌నాథ్ వ‌చ్చి.. జ‌వానుకు నివాళి అర్పించే వ‌ర‌కూ ద‌హ‌న సంస్కారాలు చేయ‌మ‌ని జ‌వాను కుటుంబ స‌భ్యులు తేల్చి చెప్పారు. అంతేకాదు.. జ‌వాను పిల్ల‌ల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగం క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు. దీంతో.. వీర జ‌వాను అంత్య‌క్రియ‌ల‌పై ప్ర‌తిష్ఠంభ‌న చోటు చేసుకుంది. ఇలాంటి ప‌రిస్థితులు మిగిలిన రాష్ట్రాల్లో ఏర్ప‌డితే ముఖ్య‌మంత్రులు ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది తెలిసిందే.

దీనికి భిన్నంగా.. ఈ ఇష్యూ బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే స్పందించిన యూపీ సీఎం యోగి.. వెనువెంట‌నే వీర జ‌వాను కుటుంబ స‌భ్యుల‌తో ఫోన్లో మాట్లాడారు. తాను 13వ రోజు నిర్వ‌హించే క‌ర్మ‌కు త‌ప్ప‌నిస‌రిగా వ‌స్తాన‌ని.. ప్రేమ్ కుమార్తెకు ఉద్యోగాన్ని ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. సీఎం స్వ‌యంగా హామీ ఇవ్వ‌టంతో జ‌వాను అంత్య‌క్రియ‌ల్ని నిర్వ‌హించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/